ప్రకాష్ రాజ్‌ను సినిమాల నుంచి బహిష్కరించాలి: హిందూ సంఘాలు

| Edited By:

Oct 31, 2019 | 12:00 PM

ఇటీవలే.. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌పై ప్రకాష్ రాజ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్తా.. ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ వ్యాఖ్యలపై.. భారత హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ను సినిమాల నుంచి బహిష్కరించాలని.. భారత హిందూ మహాసభ సభ్యులు కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. హిందూ దేవుళ్లు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా.. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఆయనను వెంటనే.. సినిమాల నుంచి బహిష్కరించాలని.. కోరుతూ.. […]

ప్రకాష్ రాజ్‌ను సినిమాల నుంచి బహిష్కరించాలి: హిందూ సంఘాలు
Follow us on

ఇటీవలే.. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌పై ప్రకాష్ రాజ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్తా.. ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ వ్యాఖ్యలపై.. భారత హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ను సినిమాల నుంచి బహిష్కరించాలని.. భారత హిందూ మహాసభ సభ్యులు కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. హిందూ దేవుళ్లు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా.. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఆయనను వెంటనే.. సినిమాల నుంచి బహిష్కరించాలని.. కోరుతూ.. కన్నడ సినిమాల్లో ప్రకాష్‌ రాజ్‌కు అవకాశాలు ఇవ్వొద్దని.. ఫిల్మ్ ఛాంబర్ సభ్యులను కోరారు. అయినప్పటికీ.. ఆయనకు అవకాశాలు ఇస్తే.. మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

తాజాగా.. యూపీలో జరిగిన రథోత్సవంపై ప్రకాష్ రాజ్.. ఓ టీవీ ఛానెల్‌ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. యూపీ సీఎంపై.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. రథోత్సవానికి ముంబై నుంచి మోడళ్లను రప్పించి.. మొఖాలకు రంగులు వేయించి.. దేవుళ్లలా వేషాలు వేయించారని.. వారికి ఐఏఎస్‌లు సైతం నమస్కరించారంటూ.. వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ హిందూ సంఘాలు ప్రకాష్ రాజ్‌పై ఫిర్యాదు చేశారు.