బాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాకు గుండెపోటు..ఐసీయూలో చికిత్సను అందిస్తున్న వైద్యులు

|

Dec 11, 2020 | 9:20 PM

బాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా( 46 )గుండెపోటుకు గురయ్యారు. ఆయనను కుటుంబసభ్యులు  వెంటనే ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ కు తరలించారు.

బాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాకు గుండెపోటు..ఐసీయూలో చికిత్సను అందిస్తున్న వైద్యులు
Follow us on

బాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా( 46 )గుండెపోటుకు గురయ్యారు. ఆయనను కుటుంబసభ్యులు  వెంటనే ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆయనకు యాంజియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం రెమో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన సన్నిహితులు తెలుపుతున్నారు. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, డ్యాన్స్ ప్లస్, ఝలక్ దిక్లాజా వంటి డ్యాన్స్ రియాల్టీ షోలకు ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ‘ఫాల్తూ’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి… రేస్-3, ఏబీసీడీ సిరీస్ లను తెరకెక్కించారు. రెమో డిసౌజా గుండెపోటుకు గురయ్యారన్న వార్తతెలిసి బాలీవుడ్ ప్రముఖులు ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.