Megastar Chiranjeevi: ‘నక్సలైట్‌’గా చిరు.. కేక పుట్టిస్తోన్న లీక్డ్ లుక్..!

| Edited By:

Feb 23, 2020 | 2:27 PM

కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం ఆచార్య. ఇందులో చిరు నక్సలైట్‌గా కనిపించబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు రాగా.. తాజాగా ఈ మూవీ షూటింగ్ నుంచి చిరు లుక్ లీక్ అయ్యింది. అందులో ఎర్ర కండువాతో చిరంజీవి లుక్ కేక పుట్టిస్తోంది. ఇక ఈ

Megastar Chiranjeevi: నక్సలైట్‌గా చిరు.. కేక పుట్టిస్తోన్న లీక్డ్ లుక్..!
Follow us on

కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం ఆచార్య. ఇందులో చిరు నక్సలైట్‌గా కనిపించబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు రాగా.. తాజాగా ఈ మూవీ షూటింగ్ నుంచి చిరు లుక్ లీక్ అయ్యింది. అందులో ఎర్ర కండువాతో చిరంజీవి లుక్ కేక పుట్టిస్తోంది. ఇక ఈ మూవీ కోసం మెగాస్టార్ కాస్త సన్నబడ్డట్లు కూడా ఆ లుక్‌లో అర్థమవుతోంది. ఈ లుక్‌ను చూసిన ఫ్యాన్స్ ‘‘వావ్ సూపర్.. మెగాస్టార్ మీరు కేక.. 20సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో, ఇప్పుడు అలానే ఉన్నారు బాసూ’’.. అని కామెంట్లు పెడుతున్నారు.

నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది. రామ్ చరణ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. రంగస్థలం షూటింగ్ చేసిన సెట్లోనే భారీ సెట్ వేయగా.. అక్కడే 50రోజుల చిత్రీకరణ జరగనుంది.