Boycott Tandav: తాండవ్ సినిమాపై వివాదం.. ‘యాంటీ హిందూ సిరీస్’ అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు..

|

Jan 17, 2021 | 1:46 PM

Boycott Tandav: జనవరి 15న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన తాండవ్ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకుంది. ఈ ఏడాది మొదటి కాంట్రవర్సీ

Boycott Tandav: తాండవ్ సినిమాపై వివాదం.. ‘యాంటీ హిందూ సిరీస్’ అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు..
Follow us on

Boycott Tandav: జనవరి 15న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన తాండవ్ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకుంది. ఈ ఏడాది మొదటి కాంట్రవర్సీ చిత్రంగా నిలిచింది. ఈ వెబ్‌సిరీస్‌లో ‘హిందూ’ మనోభావాలను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని నెటిజన్లు ‘తాండవ్’ సిరీస్‌ను బాయ్‌కాట్ చేయాల్సిందిగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కింది.

ఇందులో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్ర చేయగా డింపుల్ కపాడియా, మహ్మద్ జీషన్ అయూబ్, డినో మోరియా, అనుప్ సోని, కృతిక కమ్రా ఇతర పాత్రలు పోషించారు. ఇందులో హిందూ దేవతలను అపహాస్యం చేయడంతో పాటు, హిందూ సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఉద్దేశపూర్వకంగా విభజనలు రేకెత్తించేలా సన్నివేశాలను చిత్రీకరించారని, ‘యాంటీ హిందూ సిరీస్’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బ్యాన్‌ తాండవ్ నవ్’(#banTandavnow)బాయ్‌కాట్ తాండవ్ (#boycottTandav) అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను మైక్రోబ్లాగింగ్ సైట్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఇంకెంత కాలం హిందువులు కాంప్రమైజ్ కావాలి. బాలీవుడ్ హిందూ సంస్కృతిని డ్యామేజ్ చేస్తుంది. గట్టిగా ప్రతిధ్వనించండి బాయ్ కాట్ తాండవ్’అని జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి ట్వీట్ పెట్టాడు.