బాలయ్య సినిమాపై బోయపాటి సంచలన నిర్ణయం..?

| Edited By:

Jan 08, 2020 | 12:15 PM

బాలకృష్ణతో బోయపాటి శ్రీను హ్యాట్రిక్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. మిర్యాల రవీంద్రారెడ్డి నిర్మించబోతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు కూడా ఆ మధ్యనే పూర్తయ్యాయి. ఇక స్క్రిప్ట్‌ను పూర్తి చేసి, వీలైనంత త్వరగా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలనుకున్నాడు బోయపాటి. అయితే రూలర్ ఎఫెక్ట్‌తో ఈ మూవీ విషయంలో బోయపాటి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ స్క్రిప్ట్ మొత్తాన్ని మార్చాలని బోయపాటి అనుకున్నారట. మొదట ఈ సినిమాను 70కోట్లతో తెరకెక్కించాలని అనుకున్నారు. […]

బాలయ్య సినిమాపై బోయపాటి సంచలన నిర్ణయం..?
Follow us on

బాలకృష్ణతో బోయపాటి శ్రీను హ్యాట్రిక్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. మిర్యాల రవీంద్రారెడ్డి నిర్మించబోతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు కూడా ఆ మధ్యనే పూర్తయ్యాయి. ఇక స్క్రిప్ట్‌ను పూర్తి చేసి, వీలైనంత త్వరగా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలనుకున్నాడు బోయపాటి. అయితే రూలర్ ఎఫెక్ట్‌తో ఈ మూవీ విషయంలో బోయపాటి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ స్క్రిప్ట్ మొత్తాన్ని మార్చాలని బోయపాటి అనుకున్నారట.

మొదట ఈ సినిమాను 70కోట్లతో తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ రూలర్ పెద్ద పరాజయంగా మిగలడం, పెట్టిన పెట్టుబడుల్లో కనీసం 25శాతం కూడా రాకపోవడంతో.. ఈ మూవీ బడ్జెట్‌ను తగ్గించాలని బోయపాటికి నిర్మాత సూచించారట. దీంతో స్క్రిప్ట్ మొత్తాన్ని ఛేంజ్ చేసే పనిలో పడ్డారట బోయపాటి. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది..? ఎప్పుడు రిలీజ్ అవుతుంది..? అనే వివరాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.