బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఈ ఏడాది పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షారుఖ్.. ఆ వెంటనే జవాన్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు. వరుస డిజాస్టర్లతో ఢీలా పడిన బాలీవుడ్‌కు మరోసారి కొత్త ఆశలు కలిగించాడు కింగ్. ఇక ఈ ఏడాది చివర్లో డుంకీ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే ప్రస్తుతం బీటౌన్ ఇండస్ట్రీలో అత్యంత సంపన్న నటులలో షారుఖ్ ఒకరు. మన్నత్ నివాసంతోపాటు.. ఆయన వద్ద ఖరీదైన వాచ్ లు, కార్లు, ఆస్తులు వరకు అన్ని విషయాలపై నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక మారుతున్న ఫ్యాషన్ ప్రపంచంలో షారుఖ్ ముందుంటారు. 6000 కోట్ల రూపాయల నికర విలువతో బాద్ షా ప్రస్తుతం భారతదేశపు అత్యంత ధనిక నటుడు. అతని విలాసవంతమైన జీవనశైలిలో ఒక ప్రత్యేక అంశం తరచుగా దృష్టిని ఆకర్షిస్తుంది. అదే అతని మల్టీ-మిలియన్ డాలర్ల వాచ్ సేకరణ.
ఇటీవల ఢిల్లీలో జరిగిన హ్యుందాయ్ ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్ లగ్జరీపై ఖరీదైన వాచ్ కలెక్షన్స్ పై మరోసారి తన ఆసక్తిని చూపించారు. ఈ ఈవెంట్ భారతదేశంలో వైకల్యం ఉన్న వ్యక్తులకు మద్దతు ఇవ్వడానికి లక్ష్యంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు షారుఖ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెల్లటి చొక్కా, ఫ్యాషన్ బ్లూ బ్లేజర్, బూడిద రంగు ప్యాంటు ధరించి, సొగసైన బ్లూ ఏవియేటర్‌లు , అతని సిగ్నేచర్ పోనీ హెయిర్‌స్టైల్‌తో షారుఖ్ స్టైల్ లుక్ మరింత పెంచేసింది. ఇక ఇదే ఈవెంట్లో అతను పాటెక్ ఫిలిప్ వాచ్ ధరించాడు.
ఈ వాచ్ ధర రూ. 4.66 కోట్లు అని తెలుస్తోంది. ఇంతకు ముందు షారుఖ్ వాచ్, కార్ కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలు వైరలయ్యాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో డుంకీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో తాప్సీ కథానాయికగా నటిస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Now time to go for the rest of the days journey. Have fun guys and girls. Thank u for your time. Enjoy Lutt Putt a little more….until next time. Love u all. #Dunki
— Shah Rukh Khan (@iamsrk) November 22, 2023
Tere Dil Mein Tent Lagaunga
Tere Ishq mein Goteh Khaunga
Main toh gaya…
Lutt Putt Gaya
30 days to the journey of Love….#Dunki.#DunkiDrop2 – #LuttPuttGaya song out tomorrow! pic.twitter.com/PSZ65RQwuz— Shah Rukh Khan (@iamsrk) November 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.