Karan Johar: తన బయోపిక్‌ కోసం స్టార్ హీరోను ఫిక్స్ చేసిన కరణ్ జోహార్.. నెక్ట్స్ లెవల్ అంతే

|

Dec 05, 2022 | 9:46 AM

తన లైఫ్‌ హిస్టరీని సినిమాగా రూపొందించాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉందన్నారు ఈ స్టార్ మేకర్‌. అంతేకాదు టైటిల్ రోల్‌లో ఎవరు నటిస్తే బాగుంటుంది అన్న విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు.

Karan Johar: తన బయోపిక్‌ కోసం స్టార్ హీరోను ఫిక్స్ చేసిన కరణ్ జోహార్.. నెక్ట్స్ లెవల్ అంతే
Karan Johar
Follow us on

ఒకప్పుడు బయోపిక్ అంటే పాత తరం వాళ్లకు సంబంధించిన సినిమాలే కనిపించేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ వేరు. ప్రజెంట్ ఫామ్‌లో ఉన్న వాళ్ల గురించి కూడా సినిమాలు తీసేస్తున్నారు స్టార్స్‌. ఈ లిస్ట్‌లో ఓ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ పేరు తెర మీదకు వచ్చింది. తన బయోపిక్ కోసం ఆల్రెడీ ఓ హీరోను ఫిక్స్ చేశారు ఆ స్టార్ మేకర్‌.

కరణ్ జోహార్‌… బాలీవుడ్‌లో మాత్రమే కాదు నేషనల్ లెవల్‌లో మూవీ లవర్స్‌కు పరిచయం అక్కర్లేని పేరు. భారీ చిత్రాలతో పాటు అంతకు మించిన వివాదాలతో ఎప్పుడు వార్తల్లో కనిపిస్తుంటారు కరణ్. సినీ రంగంలో తెర వెనుకే పనిచేస్తున్న తెర మీద కూడా చూపించేంత మ్యాటర్ కరణ్ లైఫ్‌లో ఉంది. అందుకే ఆయన బయోపిక్ విషయంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వూలో తన బయోపిక్‌ గురించి స్పందించారు కరణ్ జోహార్‌. తన లైఫ్‌ హిస్టరీని సినిమాగా రూపొందించాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉందన్నారు ఈ స్టార్ మేకర్‌. అంతేకాదు టైటిల్ రోల్‌లో ఎవరు నటిస్తే బాగుంటుంది అన్న విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు.

బాలీవుడ్ టాప్ హీరో రణవీర్‌ సింగ్‌ను తన పాత్రకు పర్ఫెక్ట్ చాయిస్ అన్నది కరణ్ వర్షన్‌. స్వయంగా కరణే చెప్పటంతో రణవీర్‌ హీరోగా కరణ్ బయోపిక్ ఫిక్స్ అయినట్టే అంటున్నారు బాలీవుడ్ సినీ జనాలు. ఈ మూవీ బాలీవుడ్‌లో మోస్ట్ కలర్‌ఫుల్ బయోగ్రాఫికల్ మూవీ అవుతందంటున్నారు క్రిటిక్స్‌. ట్విస్ట్‌లు, టర్న్‌లతో పాటు.. గ్లామరస్‌ హీరోయిన్స్‌, కాంట్రవర్షియల్ షోస్‌, ట్రెండ్‌ను మార్చిన మూవీస్‌తో కరణ్ బయోపిక్‌ ఓ ట్రెండ్ సెట్టర్‌ అవుతుందన్నది ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. అందుకే ఈ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్‌.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.