Janhvi Kapoor : బెల్లీ డాన్స్‌‌‌‌తో అదరగొట్టిన జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో వీడియో హల్‌‌‌‌‌‌‌‌చల్..

అతిలోక సుందరి శ్రీ దేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.  ఈ ముద్దుగుమ్మ 'దఢక్' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

Janhvi Kapoor : బెల్లీ డాన్స్‌‌‌‌తో అదరగొట్టిన జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో వీడియో హల్‌‌‌‌‌‌‌‌చల్..

Updated on: Jan 13, 2021 | 4:29 PM

Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీ దేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.  ఈ ముద్దుగుమ్మ ‘దఢక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. జాన్వీ నటనతోపాటు మంచి అభినయం కనబరిచి ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. అలాగే జాన్వీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా  ఉంటుంది. తన సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా జాన్వీ కపూర్ ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంది. కరీనా కపూర్ ఖాన్ పాటకు జాన్వి కపూర్ బెల్లీ డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. `అశోకా` చిత్రంలోని కరీనా కపూర్ ఖాన్ పాటకు జాన్వి తన బెల్లీ డాన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం జాన్వీ `గుడ్ లక్ జెర్రీ` అనే మూవీ షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమా తో పాటు కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న దోస్తానా 2లో హీరోయిన్ గా నటిస్తుంది జాన్వీ కపూర్.

Loading...
Unable to load recommendations.
Follow Us