‘వాల్మీకీ’ సినిమా పేరు మార్చాలి.. మనోభావాలు దెబ్బతింటున్నాయి: కన్నా

| Edited By:

Sep 18, 2019 | 2:12 PM

‘వాల్మీకీ’ సినిమా టైటిల్‌పై ఈ మధ్య అభ్యంతరాలు వ్యక్తమవుతోన్నాయి. హైకోర్టులో కేసులు కూడా వేశారు. సినిమా టైటిల్ మర్చాలని.. ఇదివరకే పలువరు గొడవ చేయగా.. ఇప్పుడు ఈ సినిమాపై బీజేపీ సీనియర్ లీడర్.. కన్నా లక్ష్మీనారాయణ స్పందించడం వివాదాస్పదంగా మారింది. ‘వాల్మీకీ’ సినిమా టైటిల్‌తో కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయని.. వెంటనే పేరు మార్చాలని డిమాండ్ చేశారు కన్నా లక్ష్మీనారాయణ. కొణిదెల వరుణ్ తేజ్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈసినిమాకి హరీష్ శంకర్ […]

వాల్మీకీ సినిమా పేరు మార్చాలి.. మనోభావాలు దెబ్బతింటున్నాయి: కన్నా
Follow us on

‘వాల్మీకీ’ సినిమా టైటిల్‌పై ఈ మధ్య అభ్యంతరాలు వ్యక్తమవుతోన్నాయి. హైకోర్టులో కేసులు కూడా వేశారు. సినిమా టైటిల్ మర్చాలని.. ఇదివరకే పలువరు గొడవ చేయగా.. ఇప్పుడు ఈ సినిమాపై బీజేపీ సీనియర్ లీడర్.. కన్నా లక్ష్మీనారాయణ స్పందించడం వివాదాస్పదంగా మారింది. ‘వాల్మీకీ’ సినిమా టైటిల్‌తో కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయని.. వెంటనే పేరు మార్చాలని డిమాండ్ చేశారు కన్నా లక్ష్మీనారాయణ.

కొణిదెల వరుణ్ తేజ్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈసినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. తమిళ్ సినిమా ‘జిగర్తాండ’ను తెలుగులో రిమేక్ చేశారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ ఇన్‌ట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్ నట విశ్వరూపం చూపించాడు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది.