Bigg Boss Abhijeet : ఆచితూచి అడుగులు వేస్తున్న బిగ్ బాస్ విన్నర్.. ఎట్టకేలకు సినిమాను ఓకే చేసాడు..

బిగ్ బాస్ సీజన్ 4 తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో అభిజీత్. బిగ్ బాస్ తర్వాత కంటెస్టెంట్స్ అంతా వచ్చిన అవకాశాలను..

Bigg Boss Abhijeet : ఆచితూచి అడుగులు వేస్తున్న బిగ్ బాస్ విన్నర్.. ఎట్టకేలకు సినిమాను ఓకే చేసాడు..

Updated on: Jan 25, 2021 | 12:36 PM

Bigg Boss Abhijeet : బిగ్ బాస్ సీజన్ 4 తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో అభిజీత్. బిగ్ బాస్ తర్వాత కంటెస్టెంట్స్ అంతా వచ్చిన అవకాశాలను వదలకుండా సినిమాలు చేస్తున్నారు. కానీ అభిజీత్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. సైలెంట్ గా ఉంటూ స్మార్ట్ గా ఆలోచించే అభిజీత్ తన దగ్గరకు వచ్చిన కథల విషయంలో హడావుడిగా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడుతున్నాడు.బిగ్ బాస్ కు వెళ్ళాక ముందు సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు అభి.

ఇప్పటికే ఈ యంగ్ హీరోకు చాలా మంది నూతన దర్శకులు కథలను వినిపించారట. ఎట్టకేలకు ఓ కథను ఓకే చేసాడు ఈ బిగ్ బాస్ విన్నర్.  ఈ విషయాన్నీ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. బిబి 4 క్రేజ్ ను ఉపయోగించుకుని మంచి కథతో సినిమా చేస్తే తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అనే ధీమాతో ఉన్నాడు అభిజీత్. అయితే విభిన్నమైన కథతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యే అవకాశం ఉందని సమాచారం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Liger Movie: త్వరలో ప్రేక్షకుల ముందుకు పూరీ-దేవరకొండ మూవీ.. జూలైలో అటాక్ చేయనున్న ‘లైగర్’ ?