Bigg Boss 4: అభిజిత్‌ని వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ అన్న బిగ్‌బాస్.. క్షమాపణ కోరిన అభి

| Edited By:

Nov 28, 2020 | 7:25 AM

ఈ వారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో కంటెస్టెంట్‌లు ఎవ్వరూ ఆశాజనకమైన ప్రదర్శన ఇవ్వలేదని బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు

Bigg Boss 4: అభిజిత్‌ని వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ అన్న బిగ్‌బాస్.. క్షమాపణ కోరిన అభి
Follow us on

Abhijeet Worst Performer: ఈ వారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో కంటెస్టెంట్‌లు ఎవ్వరూ ఆశాజనకమైన ప్రదర్శన ఇవ్వలేదని బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక దెయ్యం జలజ ఇచ్చిన టాస్క్‌లని అభిజిత్ నిరాకరించారని.. అందుచేత అతడు వరస్ట్ పెర్ఫార్మర్ అని బిగ్‌బాస్ ప్రకటించారు. ఈ కారణంగా ఇంటి సభ్యులకు ఎలాంటతి లగ్జరీ బడ్జెట్ లభించదని తెలిపాడు. 12 వారాల ప్రయాణం తరువాత అయినా టాస్క్‌ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు అతడు వివరించాడు. ఇక ఈ టాస్క్‌లో ఎందుకు విఫలం అయ్యారో..? ఎక్కడ పొరపాటు జరిగిందో..? ఇంటి సభ్యులు చర్చించుకుని ఆ అభిప్రాయాన్ని తనకు చెప్పాలని పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా అవినాష్‌ మాట్లాడుతూ.. తనకు ఇచ్చిన టాస్క్‌ని పూర్తి చేశానని, రాత్రంతా నిద్రపోలేదని చెప్పుకొచ్చాడు. ఇక మోనాల్‌- అఖిల్‌ డేట్‌కి వెళ్లారని తెలిపాడు. దీంతో మధ్యలో కలగజేసుకున్న అభిజిత్‌.. మోనాల్‌తో డేట్‌కి వెళ్లాలని పంపిన లెటర్ వలన పర్సనల్‌గా తాను హర్ట్‌ అయ్యానని అభిజిత్‌ చెప్పాడు. ఆ లెటర్‌లో అఖిల్‌, అభిజిత్‌లు కలిసిన మోనాల్‌ని ఏడిపించారన్న పదాలు తనకు అర్థం కాలేదని, ఆమెను ఏడిపించాననటం వ్యక్తిగతంగా తనను బాధించిందని తెలిపాడు. అందుకే టాస్క్‌ చేయడానికి నిరాకరించానని వివరించాడు. ఒకవేళ తన వలన మిస్టేక్ జరిగితే క్షమాపణ కోరుతున్నానని అభి వివరణ ఇచ్చాడు.