Bigg Boss 4: మళ్లీ మోనాల్‌కి దూరంగా అఖిల్‌

| Edited By:

Nov 03, 2020 | 8:09 AM

మోనాల్‌ విషయంలో అఖిల్ తీరు అప్పుడప్పుడూ మారుతుంటోంది. ఎప్పుడూ ఆమెతో సన్నిహితంగా ఉండే అఖిల్‌.. అప్పుడప్పుడు ఏమౌతుందో తెలీదు

Bigg Boss 4: మళ్లీ మోనాల్‌కి దూరంగా అఖిల్‌
Follow us on

Monal Akhil Bigg Boss 4: మోనాల్‌ విషయంలో అఖిల్ తీరు అప్పుడప్పుడూ మారుతుంటోంది. ఎప్పుడూ ఆమెతో సన్నిహితంగా ఉండే అఖిల్‌.. అప్పుడప్పుడు ఏమౌతుందో తెలీదు గానీ కాస్త దూరంగా ఉంటున్నాడు. ఇదివరకు ఎపిసోడ్‌లలోనూ మోనాల్‌కి అఖిల్‌ దూరంగా ఉండగా.. సోమవారం ఎపిసోడ్‌లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. మోనాల్‌కి అఖిల్‌ దూరంగా ఉండగా.. అతడి వద్దకు వచ్చిన మోనాల్‌ ఏమైంది, ఎందుకు దూరంగా ఉంటున్నావు అని అడిగింది. ( Bigg Boss 4: నామినేషన్ల పర్వం.. అభి, అవినాష్‌ మధ్య రచ్చ రచ్చ)

అదేం లేదని అఖిల్‌ చెప్పగా.. హగ్గు ఇవ్వు అని మోనాల్ అడిగింది. అయితే అఖిల్‌ మనస్పూర్తిగా కౌగలించుకోగపోగా.. కాస్త చిన్నబుచ్చుకున్న మోనాల్‌.. నా అఖిల్‌ అయితే ఇలా కౌగలించుకోడు అని బుంగమూతి పెట్టింది. నీకు స్పేస్ కావాలా..? ఏమైంది నీకు..? నా అఖిల్ గురించి నాకు తెలుసు.? అంటూ మాట్లాడింది. దీంతో నాకు కొంత టైం కావాలి అంటూ ఎప్పటిలాగే తనదైన శైలిలో అఖిల్‌ చెప్పాడు.  ( ముంబై దాడి తరహాలో.. ఆస్ట్రియా రాజధానిలో వరుస కాల్పులు)