‘రూలర్’ టీజర్ రిలీజ్… బాలయ్య న్యూ లుక్ అదుర్స్!

| Edited By: Srinu

Nov 21, 2019 | 6:54 PM

బాలకృష్ణ ‘రూలర్’ రిలీజ్ కి ఇంకా నెల రోజులే ఉండడంతో తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సాయంత్రం 5 గంటలకు టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ లో బాలయ్యను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న సినిమా ‘రూలర్’. ఈ  మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల […]

‘రూలర్’ టీజర్ రిలీజ్... బాలయ్య న్యూ లుక్ అదుర్స్!
Follow us on

బాలకృష్ణ ‘రూలర్’ రిలీజ్ కి ఇంకా నెల రోజులే ఉండడంతో తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సాయంత్రం 5 గంటలకు టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ లో బాలయ్యను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న సినిమా ‘రూలర్’. ఈ  మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. రూలర్ టీజర్ లో బాలయ్య పైనే ఫోకస్ చేసాడు దర్శకుడు. “ఒంటిమీద  ఖాకీ డ్రస్ ఉన్నపుడే బోన్‌లో పెట్టిన సింహాన్ని.. ఒక్కసారి అది తీసేస్తే బయటికి వచ్చిన సింహాన్ని.. ఇక వేటే” అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఈ సినిమాలో బాలయ్య ఓ మాఫియా డాన్ గానూ, పోలీస్ అధికారిగానూ కనిపించనున్నారు.