రిజెక్ట్ చేసిన బాలయ్య.. ఓకే చెప్పిన గోపిచంద్..!

| Edited By:

Jun 09, 2020 | 7:32 AM

ఓ హీరో వదులుకున్న సినిమాలో మరో హీరో నటించడం ఇండస్ట్రీలో కొత్తేం కాదు. టాలీవుడ్ మొదలు బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ ఇలా వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి.

రిజెక్ట్ చేసిన బాలయ్య.. ఓకే చెప్పిన గోపిచంద్..!
Follow us on

ఓ హీరో వదులుకున్న సినిమాలో మరో హీరో నటించడం ఇండస్ట్రీలో కొత్తేం కాదు. టాలీవుడ్ మొదలు బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ ఇలా వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. కాగా అప్పుడెప్పుడు బాలయ్య నో చెప్పిన ఓ సినిమాకు ఇటీవల గోపిచంద్ ఓకే చెప్పారట. ఈ వార్త ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మ్యాచో హీరో గోపిచంద్‌తో దర్శకుడు తేజ ‘అలివేలు వెంకటరమణ’ అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ కథను తేజ, బాలయ్య కోసం రాసుకున్నారట.

రెండేళ్ల క్రితమే ఈ కథను బాలయ్యకు వినిపించారట తేజ. అయితే దీనిపై పెద్దగా ఆసక్తిని చూపని బాలకృష్ణ.. ఎన్టీఆర్‌ బయోపిక్‌ బాధ్యతలను తేజకు అప్పగించారట. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ను అనౌన్స్‌ చేసిన తేజ, సెట్స్‌పైకి కూడా తీసుకెళ్లారు. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తేజ తప్పుకోగా.. క్రిష్‌ లైన్‌లోకి వచ్చారు. ఇది పక్కన పెడితే బాలయ్య రిజెక్ట్ చేసిన అలివేలు వెంకటరమణ కథను తేజ, గోపిచంద్‌కి చెప్పడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయి. కాగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా అలివేలు వెంకటరమణ తెరకెక్కుతోంది. గోపిచంద్ కెరీర్‌లో గుర్తిండిపోయే చిత్రంగా ఈ మూవీ ఉండబోతుందని మూవీ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మరోసారి అనుష్క నటించబోతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Read This Story Also: జర్నలిస్ట్‌లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తాం: ఈటెల