‘సాహో’ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా – స్వీటీ కామెంట్!

|

May 21, 2019 | 7:53 PM

‘డార్లింగ్’ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’ నుంచి కొత్త పోస్టర్ ఈరోజు విడుదలైంది. ఇక దీనిపై స్వీటీ అనుష్క స్పందిస్తూ తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ‘ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి పోస్టర్, వీడియో.. ఆ తర్వాత ఏమి జరగబోతుంది అన్న ఆలోచనలో పడేస్తోంది. ప్రతిసారీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆగస్ట్‌ 15 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ప్రభాస్‌కు, యూవీ క్రియేషన్స్‌కు, సుజిత్‌కు,చిత్ర యూనిట్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికి ఆల్‌ ది […]

సాహో కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా - స్వీటీ కామెంట్!
Follow us on

‘డార్లింగ్’ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’ నుంచి కొత్త పోస్టర్ ఈరోజు విడుదలైంది. ఇక దీనిపై స్వీటీ అనుష్క స్పందిస్తూ తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.

‘ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి పోస్టర్, వీడియో.. ఆ తర్వాత ఏమి జరగబోతుంది అన్న ఆలోచనలో పడేస్తోంది. ప్రతిసారీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆగస్ట్‌ 15 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ప్రభాస్‌కు, యూవీ క్రియేషన్స్‌కు, సుజిత్‌కు,చిత్ర యూనిట్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికి ఆల్‌ ది బెస్ట్‌. ఎగ్జైటెడ్‌’ అని ట్వీట్ చేసింది.

ఇకపోతే అనుష్క ‘సైలెన్స్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.