జగన్ జీవిత కథపై బాలీవుడ్ దర్శకుడి కన్ను

| Edited By:

May 29, 2019 | 2:18 PM

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ఏపీ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే ముఖ్యమంత్రి కుమారుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. జగన్‌ ఈ విజయ శిఖరాన్ని చేరుకునేందుకు చాలా కష్టాలే పడ్డారు. తండ్రి అనూహ్య మరణం(రాజశేఖర్ రెడ్డి) తరువాత మొదలైన నాటకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం.. కొత్త పార్టీ పెట్టడం, మధ్యలో అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడం.. బయటికొచ్చాక ఎన్నికల్లో […]

జగన్ జీవిత కథపై బాలీవుడ్ దర్శకుడి కన్ను
Follow us on

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ఏపీ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే ముఖ్యమంత్రి కుమారుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. జగన్‌ ఈ విజయ శిఖరాన్ని చేరుకునేందుకు చాలా కష్టాలే పడ్డారు. తండ్రి అనూహ్య మరణం(రాజశేఖర్ రెడ్డి) తరువాత మొదలైన నాటకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం.. కొత్త పార్టీ పెట్టడం, మధ్యలో అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడం.. బయటికొచ్చాక ఎన్నికల్లో ఓడి ప్రతిపక్ష హోదాకే పరిమితవ్వడం.. ఆ తరువాత ప్రజాసంకల్ప యాత్రతో ప్రజల్లోకి వెళ్లి.. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం.. ఇలా పది సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేశారు జగన్. ఈ విషయాలన్నింటిని ఓ జాతీయ పత్రిక సమూలంగా రాసుకొచ్చింది. దీనిపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ.. ‘‘మంచి కథ దొరికింది.. దీన్ని సినిమాగా మార్చేందుకు వేచి చూస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో బాలీవుడ్‌లో జగన్ బయోపిక్ రానుందని తెలుస్తోంది. కాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథలోని విశేషాలతో యాత్ర సినిమాను తీసి హిట్ కొట్టిన టాలీవుడ్ దర్శకుడు మహి వి రాఘవ్.. ఇప్పుడు జగన్ యాత్రా విశేషాలతో పార్ట్ 2 తీసేందుకు సిద్ధమయ్యారు.