Official: నిఖిల్‌ ’18 పేజెస్‌’లో అనుపమ కన్ఫర్మ్‌

| Edited By:

Oct 19, 2020 | 8:51 AM

యువ హీరో నిఖిల్‌తో 'కుమారి 21F' ఫేమ్‌ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తోన్న థ్రిల్లర్ మూవీ '18 పేజెస్'‌. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, సుకుమార్ రైటింగ్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Official: నిఖిల్‌ 18 పేజెస్‌లో అనుపమ కన్ఫర్మ్‌
Follow us on

Anupama romances Nikhil : యువ హీరో నిఖిల్‌తో ‘కుమారి 21F’ ఫేమ్‌ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తోన్న థ్రిల్లర్ మూవీ ’18 పేజెస్’‌. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, సుకుమార్ రైటింగ్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కన్ఫర్మ్ అయ్యారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనిపై స్పందించిన అనుపమ.. చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని ట్విట్టర్‌లో కామెంట్‌ పెట్టారు.

కాగా మెమోరీ లాస్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నిఖిల్‌కి ఇది మరో హిట్‌గా నిలుస్తుందని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే 18 పేజెస్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే నిఖిల్ మరోవైపు చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2లో నటించనున్నారు. ఇందులోనూ హీరోయిన్‌గా అనుపమ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే.. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో ఈ జంట కనువిందు చేయనున్నారు.

Read More:

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. 2 లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య

మళ్లీ హౌజ్‌లోకి మోనాల్‌.. అఖిల్‌ ఆనందానికి అవధుల్లేవు