ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

| Edited By:

Jul 24, 2019 | 6:02 AM

అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘కథనం’. రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శక‌త్వం వహించారు. గాయ‌త్రి ఫిల్మ్స్, మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై బి.న‌రేంద్రరెడ్డి, శ‌ర్మచుక్కా సంయుక్తంగా నిర్మించారు. రోషన్ సాలూరి సంగీతం సమకూర్చారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రారంభమై ఏడాది పైగా కావస్తోంది. కిందటేడాది దసరా పండుగ సందర్భంగా ‘కథనం’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆ తరవాత ప్రెస్ మీట్ పెట్టి […]

ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’
Follow us on

అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘కథనం’. రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శక‌త్వం వహించారు. గాయ‌త్రి ఫిల్మ్స్, మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై బి.న‌రేంద్రరెడ్డి, శ‌ర్మచుక్కా సంయుక్తంగా నిర్మించారు. రోషన్ సాలూరి సంగీతం సమకూర్చారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సినిమా ప్రారంభమై ఏడాది పైగా కావస్తోంది. కిందటేడాది దసరా పండుగ సందర్భంగా ‘కథనం’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆ తరవాత ప్రెస్ మీట్ పెట్టి సినిమా విశేషాలు వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో ఒక టీజర్ వదిలారు. ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. కానీ, ఆ తరవాత ప్రచారం నిర్వహించకపోవడం.. ట్రైలర్ కానీ, ప్రోమోలు కానీ రిలీజ్ చేయకపోవడంతో ఈ సినిమాను ప్రేక్షకులు మరిచిపోయారు. మొత్తానికి ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కిందటేడాది ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనసూయ.. ఇప్పుడు ఈ ‘కథనం’తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.

అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః బాలాజీ శ్రీ‌ను, ఎడిట‌ర్ఃఎస్‌.బి. ఉద్ద‌వ్‌, మ్యూజిక్ః రోషన్ సాలూరి , ఆర్ట్ డైరెక్ట‌ర్ః కె.వి.ర‌మ‌ణ‌, రచయిత : రాజేంద్ర భరద్వాజ్, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీః స‌తీష్ ముత్యాల‌, లైన్ ప్రొడ్యుసర్ : ఎమ్‌.విజ‌య చౌద‌రి, నిర్మాత‌లుః బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః రాజేష్ నాదెండ్ల.