Amitabh bachchan: ఆమె పై కామెంట్స్ చేసిన అమితాబ్.. బిగ్ బీ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కౌన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆయన తీరుపై

Amitabh bachchan: ఆమె పై కామెంట్స్ చేసిన అమితాబ్.. బిగ్ బీ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..

Updated on: Jan 22, 2021 | 9:33 PM

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కౌన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆయన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షోలో ఆయన అంతర్జాతీయ ద్ర నిధి సంస్థ చీఫ్ ఎకనామిస్ట్‏గా ఉన్న గీత గోపీనాథను గురించి ఓ ప్రశ్న అడిగారు. ఆమె ఫోటోను స్క్రీన్ పై చూపిస్తూ.. 2019 నుంచి గీతా గోపినాథ్ ఏ సంస్థకు ముఖ్య ఆర్థిక వేత్తగా ఉన్నారనే ప్రశ్నను కంటెస్టెంట్‏ను అడిగాడు. అయితే అక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఆమె ఫోటో చూస్తూ.. అమె ఎంత అందంగా ఉంది. ఈమె అందాన్ని ఆర్థిక వ్యవస్థతో కలిపి చూడగలమా అంటూ కామెంట్ చేశాడు.

ఇక గీతా గోపినాథ్ ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. బిగ్ బీ కామెంట్స్ నెగిటివ్‏గా తీసుకోలేదు. ఇంకా తాను అమితాబ్‏కు పెద్ద అభిమానిననీ.. తనకు ఈ వీడియో చాలా స్పెషల్ అంటూ ట్వీట్ చేసింది. అయితే బిగ్ బీ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వయసుకు ఇలాంటి మాటలు మాట్లడం ఏంటనీ మండిపడుతున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us