AA20: రికార్డు క్రియేట్ చేసిన ‘పుష్ప’ ఫస్ట్‌లుక్‌

| Edited By:

Apr 10, 2020 | 9:42 AM

టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా గుర్తింపు పొందిన బన్నీ-సుకుమార్ కాంబోలో మూడో మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

AA20: రికార్డు క్రియేట్ చేసిన పుష్ప ఫస్ట్‌లుక్‌
Follow us on

టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా గుర్తింపు పొందిన బన్నీ-సుకుమార్ కాంబోలో మూడో మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. పుష్ప టైటిల్‌తో తెరకక్కబోతోన్న ఈ మూవీలో అల్లు అర్జున్ రఫ్ లుక్‌లో అదరగొట్టేశాడు. తన సినిమాల్లో హీరోలను విభిన్నంగా చూపించే అలవాటున్న సుకుమార్.. ఇందులో బన్నీని డిజైన్‌ చేసిన తీరు ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. ఈ క్రమంలో ఈ పోస్టర్‌కు 24 గంటల్లో 84వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. దీంతో ఒక్క రోజులో అత్యధికంగా లైక్‌ చేసిన ఫస్ట్‌లుక్‌గా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది.

కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇందులో బన్నీ సరసన రష్మిక తొలిసారిగా జత కట్టబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఐదు భాషల్లో రాబోతోన్న ఈ మూవీపై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్: నిరుద్యోగ భృతికి కోటికి పైగా దరఖాస్తులు