స్టేజ్‌పై భావోద్వేగానికి గురైన బన్నీ.. నాన్నయ్యాకే…

| Edited By:

Jan 07, 2020 | 1:01 AM

స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్‌లో వస్తోన్న చిత్రం “అలవైకుంటపురంలో”. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన హీరో అల్లు అర్జున్.. భావోద్వేగానికి గురయ్యారు. తాను తండ్రినైన తర్వాత.. తనకు తండ్రి విలువ తెలిసిందన్నారు. నాన్న గురించి నేను, నాగురించి నాన్న ఎప్పుడూ స్టేజ్‌పై చెప్పుకోలేదన్న ఆయన.. న‌న్ను హీరోగా లాంచ్ చేసింది నాన్నేనని.. కానీ ఇప్పటి వరకు స‌భాముఖంగా ఆయ‌న‌కు ఎప్పుడూ థ్యాంక్స్ […]

స్టేజ్‌పై భావోద్వేగానికి గురైన బన్నీ.. నాన్నయ్యాకే...
Follow us on

స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్‌లో వస్తోన్న చిత్రం “అలవైకుంటపురంలో”. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన హీరో అల్లు అర్జున్.. భావోద్వేగానికి గురయ్యారు. తాను తండ్రినైన తర్వాత.. తనకు తండ్రి విలువ తెలిసిందన్నారు. నాన్న గురించి నేను, నాగురించి నాన్న ఎప్పుడూ స్టేజ్‌పై చెప్పుకోలేదన్న ఆయన.. న‌న్ను హీరోగా లాంచ్ చేసింది నాన్నేనని.. కానీ ఇప్పటి వరకు స‌భాముఖంగా ఆయ‌న‌కు ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోలేదన్నారు. కానీ ఇప్పుడు ఆయ‌న‌కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని.. కానీ ఈ థ్యాంక్స్ కేవ‌లం నాతో సినిమా చేసినందుకు కాదన్నారు. నాకు కొడుకు పుట్టిన త‌ర్వాత అర్థ‌మైంది ఒక‌టేనని.. నేను మా నాన్నంత గొప్ప‌గా ఎప్పుడూ కాలేనన్నారు. కనీసం ఆయ‌న‌లో స‌గం కూడా కాలేనని.. నాన్న‌లో స‌గం ఎత్తుకు ఎదిగితే చాల‌నే ఫీలింగ్ క‌లుగుతుందన్నారు. మా నాన్న‌ను నేను ప్రేమించినంత‌గా మ‌రేవ‌రినీ ప్రేమించ‌నంటూ స్టేజ్‌పైనే కంటతడి పెట్టేశాడు.