Actress Aliya Bhatt: ఓటీటీలోకి అలియా భట్ సినిమా.. భారీ డీల్ కుదుర్చుకున్న నెట్‏ఫ్లిక్స్ ?

|

Jan 26, 2021 | 2:21 PM

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్న చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ

Actress Aliya Bhatt: ఓటీటీలోకి అలియా భట్ సినిమా.. భారీ డీల్ కుదుర్చుకున్న నెట్‏ఫ్లిక్స్ ?
Follow us on

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ముంబై మాఫియా క్వీన్ ‘గంగూబాయి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. అంతేకాకుండా జయంతిలాల్ గడా ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక గంగూబాయి కతియావాడి ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నాడట దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమాకు భారీ ప్రముఖ ఓటీటీ సంస్థతో భారీ డీల్ కుదిరినట్లుగా సమాచారం.

ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‏ఫ్లిక్స్ అలియా భట్ నటిస్తున్న గంగూబాయి కతియావాడి సినిమా డిజిటల్ హక్కులను రూ.100 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా టాక్. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‏ను తెరకెక్కిస్తున్నారు. అటు ఈ సినిమా థియేటర్ రైట్స్ కూడా భారీ బడ్జెట్‏కు విక్రయించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదలకానుట్లుగా సమాచారం.