నిర్మాతగా మారిన ఏఆర్ రెహమాన్!

| Edited By:

Apr 12, 2019 | 5:28 PM

ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకులు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ నిర్మాతగా మారారు. తన సొంత బ్యానర్‌పై ‘99 సాంగ్స్’ అనే పేరుతో కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు రెహమాన్. ఈ సినిమా కథను కూడా ఆయనే రాయడం మరో విశేషం. మ్యూజికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు రెహమాన్. ‘‘99 సాంగ్స్ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో జూన్ […]

నిర్మాతగా మారిన ఏఆర్ రెహమాన్!
Follow us on

ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకులు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ నిర్మాతగా మారారు. తన సొంత బ్యానర్‌పై ‘99 సాంగ్స్’ అనే పేరుతో కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు రెహమాన్. ఈ సినిమా కథను కూడా ఆయనే రాయడం మరో విశేషం. మ్యూజికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు రెహమాన్. ‘‘99 సాంగ్స్ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో జూన్ 21న మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ విషయాన్ని తెలుపుటకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రొడక్షన్ కంపెనీ ‘వైఎం మూవీస్’ జియో స్టూడియోస్ వారితో కలిసి ఈ ప్రత్యేకమైన సినిమా చేశాం. ఇన్ని రోజులుగా మీ అందరి ప్రేమ, మద్దతు, ప్రోత్సాహం నాపై చూపిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని రెహమాన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.