Riyaz Khan: అర్దరాత్రి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు.. నటుడు రియాజ్ ఖాన్ పై నటి ఆరోపణలు..

|

Aug 27, 2024 | 2:29 PM

తాజాగా ప్రముఖ నటుడు సిద్ధిక్ పై లైంగిక ఆరోపణలు చేసిన మలయాళీ నటి రేవతి సంపత్, ఇప్పుడు మరో నటుడుపై తీవ్ర ఆరోపణలు చేసింది. నటుడు రియాజ్ ఖాన్ కూడా తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయన మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు.

Riyaz Khan: అర్దరాత్రి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు.. నటుడు రియాజ్ ఖాన్ పై నటి ఆరోపణలు..
Riyaz Khan
Follow us on

మలయాళీ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకంపనలు రేపుతోంది. సీనియర్‌ నటులు, డైరెక్టర్లు మహిళా నటులతో వ్యవహరించిన తీరు ఒక్కొక్కటిగా బటయకొస్తున్నాయి. తమకు ఎదురైన వేధింపులపై ధైర్యంగా బయటకొచ్చి చెబుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు సిద్ధిక్ పై లైంగిక ఆరోపణలు చేసిన మలయాళీ నటి రేవతి సంపత్, ఇప్పుడు మరో నటుడుపై తీవ్ర ఆరోపణలు చేసింది. నటుడు రియాజ్ ఖాన్ కూడా తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయన మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్ ను సంస్థ అధ్యక్షుడు మోహన్ లాల్ కు అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం తన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పదవిలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

తనకు తెలియకుండానే ఓ ఫోటోగ్రాఫర్ తన ఫోన్ నంబర్ రియాజ్ ఖాన్ కి ఇచ్చాడని.. అతడు తన ఫోటోస్ చూసి రియాజ్ ఆ వ్యక్తి నుంచి నా ఫోన్ నంబర్ తీసుకుని కాల్ చేశాడని తెలిపింది నటి రేవతి సంపత్. రియాజ్ తనకు అర్ధరాత్రి కాల్ చేసి అసభ్యకంరగా మాట్లాడాడని.. ఆఘటన జరిగినప్పుడు తనకు కేవలం 20 ఏళ్లు మాత్రమే అని.. అతడు కాల్ చేసి మాట్లాడడంతో షాకయ్యానని చెప్పుకొచ్చింది. తాను కొచ్చిలో 9 రోజులు ఉంటానని..తనకు కొంతమంది అమ్మాయిలను పంపించాలని కోరినట్లు తెలిపింది. రియాజ్ ఖాన్ పై నటి రేవతి సంపత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి.

జస్టిస్ హేమ కమిటీ తన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. కొంత మంది నటులు, నిర్మాతలు, దర్శకులు మద్యం తాగి నటీమణులను వేధించేవారని పేర్కొంది. అంగీకరించనివారిని, అంగీకరించని వారిని ఇబ్బందులకు గురిచేసి, వేధించేవారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీని వెనుక పెద్ద మాఫియా ఉందని తెలిపింది. 2017లో ఏర్పాటైన జస్టిస్‌ హేమ కమిటీ…మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.