Priya: కాటుక కళ్ళతో కట్టి పడేస్తున్న సోయగం.. వైరల్‌ అవుతోన్న ప్రియా ప్రకాశ్‌ ఫొటోస్‌

|

Aug 27, 2024 | 8:22 AM

ఈ క్రేజ్‌తో ప్రియాకు ఆఫర్ల వర్షం కురిసింది. తెలుగులోనూ నటించే అవకాశం తగ్గించుకుంది. తొలి సిసినిమానే నితిన్‌ సరసన 'చెక్‌'లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక బాలవుడ్‌ ఆఫర్‌ను కూడా కొట్టేసింది. అయితే ప్రియాకు అవకాశాలు వెల్లువెత్తాయి కానీ ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందించలేకపోయాయి....

Priya: కాటుక కళ్ళతో కట్టి పడేస్తున్న సోయగం.. వైరల్‌ అవుతోన్న ప్రియా ప్రకాశ్‌ ఫొటోస్‌
Priya
Follow us on

చిన్నగా కన్నుగీటి కోట్లాది మంది కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది అందాల తార ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. అప్పటి వరకు ప్రపంచానికి తెలియని ఈ చిన్నది ఒక్క వీడియోతో ఓవర్‌ నైట్‌లో టాప్‌ సెలబ్రిటీగా మారిపోయింది. యావత్ దేశంలో ప్రియా ప్రకాశ్‌ కోసం నెట్టింట సెర్చ్‌ చేసే పరిస్థితి వచ్చింది.

చాలా మంది కన్ను కొట్టే సన్నివేశాన్ని తమ ఫోన్ లలో స్టేటస్ గా కూడా పెట్టుకున్నారు. ఇలా రాత్రికి రాత్రి ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారింది ప్రియా. ఓరు ఆదర్‌ లవ్‌ అనే మలయాళ సినిమా ద్వారా ప్రియా ప్రపంచానికి పరిచయమైంది. నిజానికి తొలుత ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్‌ పాత్ర హీరోయిన్‌ ఫ్రెండ్ క్యారెక్టర్‌ కాగా వైరల్‌ వీడియోతో ఏకంగా మెయిన్‌ హీరోయిన్‌గా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ క్రేజ్‌తో ప్రియాకు ఆఫర్ల వర్షం కురిసింది. తెలుగులోనూ నటించే అవకాశం తగ్గించుకుంది. తొలి సిసినిమానే నితిన్‌ సరసన ‘చెక్‌’లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక బాలవుడ్‌ ఆఫర్‌ను కూడా కొట్టేసింది. అయితే ప్రియాకు అవకాశాలు వెల్లువెత్తాయి కానీ ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందించలేకపోయాయి.

భారీ ప్రాజెక్టుల్లో నటించినా ఇప్పటి వరకు ప్రియాకు ఆశించిన స్థాయిలో ఒక్క విజయం కూడా దక్కలేదని చెప్పాలి. అయితే సినిమాల విషయం ఎలా ఉన్నా.. సోషల్‌ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతుంది. ఈక్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసిన ఫొటోలతో మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చిందీ చిన్నది.

ప్రియా ప్రకాశ్‌ లేటెస్ట్‌ ఫొటోలు..

లెహంగాలో మెస్మరైజ్‌ చేసిందీ మలయాళీ ముద్దుగుమ్మ. యదపై టాటూ కనిపించేలా ఉన్న ఫొటోలు, కాటు కళ్లు కుర్రకారు చూపులను తిప్పుకోనివ్వకుండా ఉన్నాయి. ఇలా పోస్ట్‌ చేసిందో లేదో అలా ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా అందంతో కుర్రకారు హృదయాలను దోచేస్తే ఎలా ప్రియా అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక ఈ బ్యూటీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం తన దృష్టి మొత్తం బాలీవుడ్‌పైనే పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నది హిందీలో ‘3 మంకీస్’, ‘లవ్ హ్యాకర్స్’, ‘విష్ణు ప్రియా’ అనే మూడు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి.