Krithi Shetty: ఆ ఇద్దరితో నటించాలని ఉందంటోన్న కృతిశెట్టి.. బేబమ్మ టార్గెట్‌ మాములుగా లేదుగా..

|

Jul 05, 2022 | 4:57 PM

Krithi Shetty: ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి శెట్టి. తొలి సినిమాతోనే తనదైన అందం అభినయంతో ఆకట్టుకుందీ బ్యూటీ. ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు..

Krithi Shetty: ఆ ఇద్దరితో నటించాలని ఉందంటోన్న కృతిశెట్టి.. బేబమ్మ టార్గెట్‌ మాములుగా లేదుగా..
Follow us on

Krithi Shetty: ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి శెట్టి. తొలి సినిమాతోనే తనదైన అందం అభినయంతో ఆకట్టుకుందీ బ్యూటీ. ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాన్ని అందుకోవడం, కృతి నటనకు కూడా మంచి మార్కులు పడడంతో ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకుంది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కృతిశెట్టికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉందీ బ్యూటీ. కృతి నటిస్తోన్న సినిమాల్లో ‘ది వారియర్‌’ ఒకటి, రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో విడుదల చేయనున్నారు. జూలై 14న విడుదల చేయనున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే కృతి శెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రామ్‌ చరణ్‌ను ఉద్దేశించి మాట్లాడిన కృతిశెట్టి అతను సూపర్‌ క్యూట్‌ అంటూ పొగిడింది. ఇక మహేష్‌ బాబు చాలా హ్యాండ్సమ్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపించింది.

అక్కడితే అక్కడి ఈ బ్యూటీ భవిష్యత్తులో వారిద్దరితో కలిసి నటించేందుకు ఎదురు చూస్తున్నాను అంటూ అసలు విషయం చెప్పేసింది. దీంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే ఈ బ్యూటీ అగ్ర హీరోయిన్‌ స్థానంపై కన్నేసిందని పలువురు సినీ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. మరి కృతి కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..