Dimple Hayathi: రంగు తక్కువ అని చాలా మంది రిజక్ట్‌ చేశారు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఖిలాడీ బ్యూటీ..

|

Jan 31, 2022 | 2:21 PM

Dimple Hayathi: సినిమా ప్రపంచం చూడడానికి రంగుల ప్రపంచంగానే ఉంటుంది కానీ.. అందులో నటీనటులు ఎన్నో చీకటి కోణాలు చూడాల్సి వస్తుంది. అందరికీ కాకపోయినా కొందరైనా..

Dimple Hayathi: రంగు తక్కువ అని చాలా మంది రిజక్ట్‌ చేశారు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఖిలాడీ బ్యూటీ..
Follow us on

Dimple Hayathi: సినిమా చూడడానికి రంగుల ప్రపంచంగానే కనిపిస్తుంది కానీ.. అందులో నటీనటులు ఎన్నో చీకటి కోణాలు చూడాల్సి వస్తుంది. అందరికీ కాకపోయినా కొందరైనా కెరీర్‌లో ఒక్కసారైనా అవమానాలు ఎదుర్కొనే ఉంటారు. ముఖ్యంగా కెరీర్‌ తొలినాళ్లలో ఆడిషన్స్‌కు వెళ్లిన సమయంలో తిరస్కరణకు గురికావడం సర్వ సాధారణం. కానీ బాడీ షేమింగ్‌ చేస్తూ చేస్తే కామెంట్స్‌ ఎంతో ఆవేదనకు గురి చేస్తుంటాయి. ఇలా తమ జీవితంలో జరిగిన అవమానాల గురించి నటీమణులు అడపాదడపా చెబుతూనే ఉంటారు.

తాజాగా నటీమణి డింపుల్‌ హయతి కూడా తన జీవితంలో ఇలాంటి సంఘటనే ఎదుర్కొన్నట్లు తెలిపింది. గద్దలకొండ గణేష్‌ చిత్రంలో జర్రా జర్రా స్పెషల్‌ సాంగ్‌తో ప్రేక్షకులకు ఆకట్టుకున్న డింపుల్‌ కెరీర్‌ తొలినాళ్లలో అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డింపుల్‌ పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. గద్దలకొడ గణేష్‌ సినిమా కంటే ముందు చాలా ఆఫీసుల చుట్టూ తిరిగానని తెలిపిన డింపుల్‌.. నల్లగా, రంగు తక్కువ ఉన్నానని చెబుతూ తిరస్కరించారని, అలా ఎన్నిసార్లు రిజక్ట్‌ అయ్యానో లెక్కేలేదని చెప్పుకొచ్చింది.

ఇంకా విషయమై మాట్లాడుతూ.. ‘ఫెయిర్‌ స్కి్‌న్‌ ఉన్న అమ్మాయి కావాలనే వారు. ఆ సమయంలో కొంచెం బాధగా అనిపించేది. తీవ్ర నిరాశతోనే గద్దలకొండ గణేష్‌లో పాటలో నటించాను. కానీ ఆ తర్వాత అన్నీ అలాంటి అవకాశాలే వచ్చాయి. దీంతో నటిగా నన్ను నేను నిరూపించుకునేందుకు కొన్ని అవకాశాలు వచ్చినా వదులుకున్నా. సరైన స్క్రిప్ట్‌ కోసం ఎదురుచూశా. ఆ సమయంలోనే ఖిలాడి ఆఫర్‌ వచ్చింది’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ఖిలాడి చిత్రంలో నటిస్తోన్న డింపుల్‌ ఈ సినిమాతో పాటు గోపీచంద్- శ్రీవాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ నటించే ఛాన్స్‌ కొట్టేసింది.

Also Read: Kim Jong un: కిమ్‌ టాయిలెట్‌కు సెక్యూరిటీ గార్డ్స్‌.. అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..

Bheemla Nayak: పవన్.. మీ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయండి.. భీమ్లా నాయక్ సినిమాపై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు ..

Teacher Jobs Hyderabad: ప్రైమరీ, టీజీటీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఫిబ్రవకి 11