Anupama Parameswaran: అందాల అనుపమ కొత్త హాబీ.. ఎంత పద్ధతిగా చేస్తోందో చూడండి..

Anupama Parameswaran: వృత్తి ఏదైనా ప్రతీ ఒక్కరికి అభిరుచి ఉంటుంది. యాంత్రీకంగా మారే జీవితంలో తమకంటూ ఓ ప్రత్యేక హాబీ ఉండేలా చూసుకుంటారు. దీనికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండదు...

Anupama Parameswaran: అందాల అనుపమ కొత్త హాబీ.. ఎంత పద్ధతిగా చేస్తోందో చూడండి..

Updated on: Aug 02, 2022 | 8:18 PM

Anupama Parameswaran: వృత్తి ఏదైనా ప్రతీ ఒక్కరికి అభిరుచి ఉంటుంది. యాంత్రీకంగా మారే జీవితంలో తమకంటూ ఓ ప్రత్యేక హాబీ ఉండేలా చూసుకుంటారు. దీనికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండదు. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక అభిరుచిని ఎంచుకుంటారు. ఇలాగే అందాల తార అనుపమ పరమేశ్వరన్‌ తాజాగా కొత్త హాబీని అలవాటు చేసుకుంది. నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొత్త హాబీని అలవాటు చేసుకుంది.

ఇంతకీ అనుపమ కొత్త హాబీ ఏంటనేగా మీ డౌట్.. మొక్కలు పెంచడం. అవును ఇంటి బాల్కనీలో మొక్కలు నాటుతూ కుస్తీ పడింది అనుపమ. తానే స్వయంగా కుండీల్లో మట్టి నింపి, మొక్కలను నాటి నీరు పోసింది. ప్రతీ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునే ఈ బ్యూటీ తన కొత్త హాబీ విషయాన్ని కూడా షేర్‌ చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పోస్ట్‌ చేసి తన సంతోషాన్ని పంచుకుంది. ఇక మొక్కలు నాటుతోన్న సమయంలో అనుపమ డ్రస్సింగ్‌ స్టైల్, కళ్లకు బ్లాక్‌ షేడ్స్‌ కనిపించి మెస్మరైజ్‌ చేసింది. దీంతో ఈ పోస్ట్‌ చేసిన ఆమె అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక అనుపమ కెరీర్‌ విషయానికొస్తే ఇటీవల నాని హీరోగా తెరకెక్కిన అంటే సుందరానికి చిత్రంలో గెస్ట్‌ రోల్‌లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన కార్తికేయ 2 సినిమాలో విడుదలకు సిద్ధంగా ఉంది. నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో పాటు 18 పేజీస్‌, బటర్‌ఫ్లై చిత్రాలతో బిజీగా ఉందీ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us