ముప్పై ఏళ్ల వయసుకు ముందే పెళ్లిచేసుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ..

| Edited By: Pardhasaradhi Peri

Dec 31, 2020 | 8:23 AM

Actress Alaya hot comments on marriage: ‘జవానీ జానేమన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మోడల్ పూజా బేడీ కూతురు అలయ అందరికి గుర్తుండే ఉంటుంది. ఇటీవల ఓ

ముప్పై ఏళ్ల వయసుకు ముందే పెళ్లిచేసుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ..
Follow us on

Actress Alaya hot comments on marriage: ‘జవానీ జానేమన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మోడల్ పూజా బేడీ కూతురు అలయ అందరికి గుర్తుండే ఉంటుంది. ఇటీవల ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ అమ్మడు.ఇండియాలో నార్మల్‌గా తల్లిదండ్రులు అందరూ పిల్లలకు త్వరగా పెళ్లిళ్లు చేయాలని ఆరాటపడుతుంటారని కానీ తమ పేరెంట్స్ అందుకు పూర్తిగా విరుద్ధమని తెలిపింది.

30 ఏళ్ల వయసుకు ముందే పెళ్లి చేసుకోవడం కన్నా మూర్ఖమైన పని మరొకటి లేదని అంటోంది. అందరి పేరెంట్స్‌లా కాకుండా తన అమ్మానాన్న ఇద్దరూ ఫైనాన్షియల్‌ ఇండిపెండెన్స్ గురించే ఎక్కువగా మాట్లాడతారని తెలిపింది. ముందుగా కెరియర్ అండ్ వర్క్‌పై ఫోకస్ చేయాలని చెప్తుంటారని నీకు నువ్వుగా బిల్డ్ అవ్వాలని సూచిస్తారని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. అయితే ఆలయ ఐదేళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు పూజా బేడి, ఫర్హాన్ ఫర్నిచర్‌ విడిపోయారు. ఈ విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ తన పేరెంట్స్ కేవలం డైవర్స్ మాత్రమే తీసుకున్నారని పిల్లల విషయంలో మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉన్నారని తెలిపింది. తనకు ఎటువంటి లోటు రాకుండా చూశారని పేర్కొంది.