Breaking: ముగిసిన మరో శకం.. ప్రముఖ నటుడు, ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ కన్నుమూత

| Edited By:

Nov 15, 2020 | 1:17 PM

భారత సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్రా ఛటర్జీ(85) కన్నుమూశారు.

Breaking: ముగిసిన మరో శకం.. ప్రముఖ నటుడు, ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ కన్నుమూత
Follow us on

Soumitra Chatterjee death: భారత సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్రా ఛటర్జీ(85) కన్నుమూశారు. కరోనా సోకి గత నెల 6న ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. (అమ్మ చీరతో పిల్లలకు డ్రెస్‌లు కుట్టించిన హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌)

కాగా దివంగత లెజండరీ దర్శకుడు సత్యజిత్‌ రే అపుర్‌ సంసార్ మూవీ ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు ఛటర్జీ. ఆ తరువాత సత్యజిత్‌తో అతడికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలో రే దర్శకత్వంలో ఛటర్జీ 14 సినిమాల్లో నటించారు. అలాగే మృణాల్‌ సేన్‌, పతన్‌ సిన్హా లాంటి లెజెండరీ దర్శకులతో కలిసి పని చేశారు. ఈ క్రమంలో మూడు జాతీయ అవార్డులతో పాటు పద్మ భూషణ్‌, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డులు వరించాయి. రచయిత, డైరెక్టర్‌గానూ తన ప్రతిభను కనబరిచారు. ఆయన మరణంపై పలువురు స్పందిస్తున్నారు. భారత సినీ పరిశ్రమ మరో దిగ్గజ నటుడిని కోల్పోయిందని సంతాపం ప్రకటిస్తున్నారు. (తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవమిది.. గోరెటి వెంకన్నపై కేటీఆర్ ట్వీట్‌)