Tollywood: చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో తోపు విలన్.. ఒక్క ఫైట్ సీన్ కోసం లక్షల్లో డిమాండ్.. ఇప్పుడు చిన్న ఇంట్లో..

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తోపు విలన్. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అప్పట్లో ఆయన తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులకు విపరీతమైన కోపం వచ్చేది. అంతగా తన నటనతో అడియన్స్ హృదయాల్లో ముద్ర వేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆస్తులు పోగొట్టుకుని.. చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు.

Tollywood: చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో తోపు విలన్.. ఒక్క ఫైట్ సీన్ కోసం లక్షల్లో డిమాండ్.. ఇప్పుడు చిన్న ఇంట్లో..
Actor Ponnambalam

Updated on: Aug 26, 2026 | 6:43 PM

దక్షిణాది చిత్రసీమలో తనదైన నటన,కరకు విలనిజంతో గుర్తింపు పొందిన నటుడు పొన్నంబలం.. ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా విలన్ పాత్రలకు ఆయన కేరాఫ్ అడ్రస్. మెగాస్టార్ చిరంజీవి నటించిన అనేక చిత్రాల్లో ఆయన ముఖ్య పాత్రలు పోషించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఇటీవల కిడ్నీ సమస్యకు గురయ్యారు. ఆ సమయంలో చిరంజీవి తనకు ఎంతో సహయం చేశారని.. లక్షలు ఖర్చు చేసి తనకు వైద్యం చేయించారని వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్ ప్రారంభ రోజులు, సినీ రరంగంలో పడ్డ కష్టాలు , మెగాస్టార్ చిరంజీవితో పనిచేసిన అనుభవాలను ఎంతో ఆత్మీయంగా పంచుకున్నారు.

సినిమాల్లోకి రాకముందు పొన్నాంబళం నేషనల్ హైజంప్ ప్లేయర్‌గా ఉండేవారు.. పెద కుటుంబంలో జన్మించిన ఆయనకు ఏడుగురు అక్కాచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. కుటుంబ బాధ్యతల దృష్ట్యా 1985లో నెలకు రూ. 1,800 జీతంతో రైల్వే ఉద్యోగం చేసేవారు. అయితే క్రీడల్లో ఉన్న పట్టుతో, రిస్క్ స్టంట్లు చేయగల సామర్థ్యంతో ఆయన ఫైటర్ , స్టంట్ మాన్‌గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. చిరంజీవి కాంబినేషన్‌లో పనిచేయడం తన కెరీర్‌లో మరుపురాని అనుభవమని పొన్నాంబలం తెలిపారు. చిరంజీవి క్రమశిక్షణ, నటన పట్ల ఆయనకున్న అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. సెట్స్‌లో చిరంజీవి గారు తోటి నటులను , స్టంట్ మాస్టర్లను ఎంతో గౌరవించేవారని, ప్రతీ ఫైట్ సీన్‌లో ఆయన చూపించే ఎనర్జీ అద్భుతమని అన్నారు. చిరంజీవితో పనిచేసిన సినిమాలు తన సినీ జీవితానికి పెద్ద గుర్తింపు తీసుకొచ్చాయని వెల్లడించారు. ఆ రోజుల్లో ఒక ఫైట్ సీన్ చేయడానికి రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు ఇవ్వడం సాధారణం. కానీ చిరంజీవి గారి సినిమా (ఘరానా మొగుడు) క్లైమాక్స్ ఫైట్ కోసం అత్యంత ప్రమాదకరమైన, రిస్కీ స్టంట్లు చేయాల్సి వచ్చినప్పుడు, పొన్నాంబళం ఏకంగా లక్ష రూపాయలు రెమ్యునరేషన్‌గా డిమాండ్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. అంత పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేసినప్పటికీ, ఆయన రిస్క్ తీసుకునే తీరు , ఫైట్ క్వాలిటీపై నమ్మకంతో నిర్మాతలు ఆ మొత్తాన్ని చెల్లించడానికి ఒప్పుకున్నారు. ఒక స్టంట్ ఫైటర్‌గా లేదా విలన్‌గా ఆ కాలంలో ఒకే ఫైట్ సీన్‌కు లక్ష రూపాయలు తీసుకోవడం అప్పట్లో ఒక పెద్ద రికార్డు.

ఇంటర్వ్యూలో పొన్నాంబలం తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి కూడా ప్రస్తావించారు. కిడ్నీ సమస్యల కారణంగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై, సుదీర్ఘకాలం డయాలసిస్ చికిత్స పొందాల్సి వచ్చింది. ఆ కష్టకాలంలో చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు తనకు అండగా నిలిచారని తెలిపారు. ఆపద సమయంలో చిరంజీవి అందించిన మానవీయ సాయాన్ని ఆయన ఎప్పటికీ మరచిపోలేనని భావోద్వేగానికి లోనయ్యారు. క్రీడాకారుడిగా ప్రయాణం ప్రారంభించి, విలన్‌గా మెప్పించి, అనేక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడిన పొన్నాంబలం జీవిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.

ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..

పొన్నబలం ఫోటో..

Actor Ponnambalam News

ఎక్కువమంది చదివినవి : Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..

Loading...
Unable to load recommendations.
Follow Us