Actor Nani: స్టైలిష్ లుక్‏లో అదరగొట్టిన నాని.. వైరలవుతున్న లేటేస్ట్ ఫోటోస్..

|

Oct 07, 2023 | 7:19 AM

ప్రస్తుతం నాని నటిస్తోన్న సినిమా హాయ్ నాన్న. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా.. కీలకపాత్రలో శ్రుతి హాసన్ కనిపించనుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‏తో వస్తోన్న ఈ మూవీలో మరోసారి తండ్రి పాత్రలో కనిపించనున్నారు నాని. గతంలో జెర్సీ సినిమాలో తండ్రి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్

Actor Nani: స్టైలిష్ లుక్‏లో అదరగొట్టిన నాని.. వైరలవుతున్న లేటేస్ట్ ఫోటోస్..
Untitled 1
Follow us on

అష్టాచమ్మా సినిమాతో హీరోగా వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు నాని. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవలే దసరా సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం నాని నటిస్తోన్న సినిమా హాయ్ నాన్న. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా.. కీలకపాత్రలో శ్రుతి హాసన్ కనిపించనుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‏తో వస్తోన్న ఈ మూవీలో మరోసారి తండ్రి పాత్రలో కనిపించనున్నారు నాని. గతంలో జెర్సీ సినిమాలో తండ్రి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం విడుదలైన సమయమా సాంగ్ మ్యూజిక్ ప్రియులకు తెగ నచ్చేసింది. ఇక శుక్రవారం రిలీజ్ అయిన గాజు బొమ్మ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

తండ్రి, కూతురి మధ్య ఉండే అనుబంధాన్ని ఈ పాటలో చక్కగా చూపించారు. ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో నాని న్యూలుక్ తెగ వైరలవుతుంది. షార్ట్ హెయిర్ తో ట్రెండీ స్టైల్ కలెక్షన్ కాస్ట్యూమ్స్ లో అదరగొట్టే రేంజ్ లో నాని దిగిన ఫోటోషూట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక నాని న్యూలుక్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం ఈ కొత్త స్టైల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉన్న నాని. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారట. ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఇక హాయ్ నాన్న సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో నాని కూతురిగా బేబీ కియారా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.