Wayanad Landslides: రీల్‌ హీరో కాదు.. నిజంగానే రియల్‌ హీరో.. రెస్క్యూ ఆపరేషన్స్‌లో నటుడు మోహన్‌లాల్‌.. వీడియో

|

Aug 03, 2024 | 1:35 PM

రీల్‌ హీరో కాదు.. నిజంగానే రియల్‌ హీరో అనిపించుకున్నారు కేరళ నటుడు మోహన్‌లాల్‌. వయనాడ్‌ వరద బాధితుల కోసం స్వయంగా గ్రౌండ్‌లోకి దిగారు. సీఎం సహాయనిధికి ఆల్రెడీ 25లక్షల రూపాయల విరాళం అందించిన మోహన్‌లాల్‌... ఇప్పుడు నేరుగా రెస్క్యూ ఆపరేషన్స్‌ చేపట్టారు. గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో సహాయక చర్యలు చేపట్టారు.

Wayanad Landslides: రీల్‌ హీరో కాదు.. నిజంగానే రియల్‌ హీరో.. రెస్క్యూ ఆపరేషన్స్‌లో నటుడు మోహన్‌లాల్‌.. వీడియో
Mohanlal
Follow us on

రీల్‌ హీరో కాదు.. నిజంగానే రియల్‌ హీరో అనిపించుకున్నారు కేరళ నటుడు మోహన్‌లాల్‌. వయనాడ్‌ వరద బాధితుల కోసం స్వయంగా గ్రౌండ్‌లోకి దిగారు. సీఎం సహాయనిధికి ఆల్రెడీ 25లక్షల రూపాయల విరాళం అందించిన మోహన్‌లాల్‌… ఇప్పుడు నేరుగా రెస్క్యూ ఆపరేషన్స్‌ చేపట్టారు. గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో సహాయక చర్యలు చేపట్టారు. కోజికోడ్‌ నుంచి రోడ్డుమార్గంలో వయనాడ్‌కి వచ్చిన మోహన్‌లాల్‌… ఆర్మీ బేస్‌ క్యాంప్‌లో సైనికులను కలిశారు. ఆ తర్వాత ఆర్మీతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తాత్కాలిక బ్రిడ్జ్‌ల నిర్మాణం, బాధితులకు సహాయం చేయడంలో పాలుపంచుకున్నారు. దేశంలో జరిగిన ఘోర విపత్తుల్లో వయనాడ్‌ విధ్వంసం ఒకటన్నారు మోహన్‌లాల్. స్పాట్‌కి వచ్చి చూశాక… ఏ స్థాయిలో నష్టం జరిగిందో అర్ధమైందన్నారు. వరద బాధితులకు సాయం చేసేందుకు వయనాడ్‌కి వచ్చినట్టు చెప్పారు మోహన్‌లాల్‌.

కాగా.. కేరళ రాష్ట్రవ్యాప్తంగా బలితర్పణం కొనసాగుతోంది. తమవారిని కోల్పోయిన బంధువులు లక్షలాదిగా ఒకచోటకు చేరి పిండప్రదానం చేశారు. తిరువననంతపురంలో అర్చకులు వేదమంత్రాల నడుమ లక్షలమంది తమవారికి పిండ సంతర్పణ చేశారు.

వయనాడ్‌ ప్రస్తుతం మరుభూమిని తలపిస్తోంది. ఎటుచూసినా ఎక్కడ చూసినా కనుచూపుమేర పెను విధ్వంసమే కనిపిస్తోంది. ఇప్పటివరకు 344 మంది మరణించగా వందలాది మంది ఆచూకీ గల్లంతైంది. ప్రస్తుతం థర్మల్‌ స్కానర్లతో శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను డ్రోన్లతో జల్లెడపడుతోంది ఆర్మీ. డ్రోన్ వ్యూ చూస్తే చూరల్‌మల్‌లోని ప్రాంతమంతా నీట మునిగినట్లు కనిపిస్తోంది. భారీ వర్షాలకు ఇరువాజింజీ నది ఉప్పొంగి దాని ఒడ్డున ఉన్న అన్ని ప్రాంతాలను ముంచెత్తింది.

మోహన్ లాల్ కు 2009లో టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్‌తో సత్కారం లభించింది.. ఈ సంక్షోభ సమయంలో మద్దతు, సంఘీభావం అందించడం ద్వారా సేవ పట్ల తన నిబద్ధతను మోహన్ లాల్ ప్రదర్శించారంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. రీల్ హీరో కాదు రియల్ హీరో అంటూ అభినందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..