ఈ సినిమా కోసం గూగుల్‌‌‌ని తెగ వెతికేశారట..సెకండ్ మోస్ట్ సెర్చేడ్ మూవీగా ‘ఆకాశం నీ హద్దురా’..

|

Dec 18, 2020 | 10:01 PM

స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు సూర్య.

ఈ సినిమా కోసం గూగుల్‌‌‌ని తెగ వెతికేశారట..సెకండ్ మోస్ట్ సెర్చేడ్ మూవీగా ఆకాశం నీ హద్దురా..
Follow us on

స్టార్ హీరో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు హీరో సూర్య. గత కొంతకాలంగా సూర్య సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా సూర్యకు భారీ విజయాన్ని అందించింది. కరోనా కారణంగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ మూవీ సూపర్ సక్సెస్ ను సొంతంచేసుకుంది. తాజాగా ఈ మూవీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఇండియాలో ఎక్కువ మంది గూగుల్లో వెతికన సినిమాల్లో ‘ఆకాశం నీ హద్దురా’ సెకండ్ ప్లేస్ లో ఉంది. గూగుల్ మోస్ట్ సెర్చెడ్ ఇండియన్ సినిమాల జాబితాలో ఈ మూవీ రెండో స్థానం లో నిలిచింది. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ నటించిన ‘దిల్ బేచారా’ సినిమా మొదటిస్థానంలో నిలిచింది.