శరవేగంగా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ .. మేజర్ షెడ్యూల్ ను పూర్తి చేసిన జక్కన 

|

Nov 30, 2020 | 3:35 PM

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

శరవేగంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ .. మేజర్ షెడ్యూల్ ను పూర్తి చేసిన జక్కన 
Follow us on

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా రాంచరణ్, గిరిజన వీరుడు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇద్దరు వీరుల టీజర్స్ ను విడుదల చేశారు జక్కన్న. ఈ టీజర్లు సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి.

కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది. తాజాగా 50 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది ఆర్ఆర్ఆర్. ఈ భారీ షెడ్యూల్ ను రాత్రివేళలో షూట్ చేశారు. త్వరలోనే మరో షెడ్యూల్ ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు అలియా భట్ , అజయ్ దేవగన్ తో పాటు తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు హాలీవుడ్ నటులు రే స్టీవెన్ సన్‌, అలిసన్ డూడి కూడా ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నారు.