UP Elections: కేంద్రం నుంచి గ్రామాలకు నేరుగా నిధులు రావాలంటే.. బీజేపీ సర్కార్ రావాలిః మోడీ

|

Feb 28, 2022 | 4:56 PM

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోఢీ ప్రచారం నిర్వహించారు. పూర్వాంచల్‌లోని బల్లియా .సోమవారం హైబత్ పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

UP Elections: కేంద్రం నుంచి గ్రామాలకు నేరుగా నిధులు రావాలంటే.. బీజేపీ సర్కార్ రావాలిః మోడీ
Pm Modi
Follow us on

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోఢీ(Narendra Modi) ప్రచారం నిర్వహించారు. పూర్వాంచల్‌(Purvanchal)లోని బల్లియా(Balia) సోమవారం హైబత్ పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇక్కడ ఆయన విపక్షాలను తీవ్రంగా టార్గెట్ చేశారు. అదే సమయంలో, బల్లియాతో తన అనుబంధాన్ని కూడా ప్రధాని పంచుకున్నారు. బల్లియాతో నాకు ఎమోషనల్‌ అనుబంధం ఉందని, ఎందుకంటే ఉచిత గ్యాస్‌ సిలిండర్లు అందించే ఉజ్వల పథకం ఇక్కడి నుంచే ప్రారంభమైందన్నారు. యూపీ అభివృద్ధి నా బాధ్యత అన్న ప్రధాని.. ఇందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. యోగి ప్రభుత్వంలో బల్లియాకు చెందిన వ్యాపారవేత్త కూడా తన డబ్బు పోతుందన్న భయం లేదన్నారు. మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ మాటలు వినేందుకు బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. 7విడతలుగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. 6వ దశకు చేరుకున్నాయి. మార్చి 3న ఓటింగ్ నిర్వహించాల్సి ఉంది. పూర్వాంచల్‌లోని ఇతర జిల్లాల కంటే బల్లియా జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారిందని చెప్పాలి.

పేదలకు పక్కా ఇల్లు ఉండాలని, దీని కోసమే బీజేపీ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించిందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ పథకం కింద ఉత్తరప్రదేశ్‌లోని పేదలకు 34 లక్షలకు పైగా పక్కా ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ బల్లియాలో కూడా వేలాది మంది పేదలకు పక్కా ఇళ్లు ఇచ్చారు. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు గర్భిణులు పౌష్టికాహార లోపం బారిన పడకుండా ఉండేందుకు మా ప్రభుత్వం మాతృ వందన యోజన పథకాన్ని అమలు చేస్తోంది. 10 వేల కోట్ల రూపాయలకు పైగా నేరుగా గర్భిణుల ఖాతాల్లోకి చేరిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు.

60 ఏళ్లు నిండిన తర్వాత కార్మికులు, రైతులు, చిన్న దుకాణదారులు అందరికీ నెలకు రూ.3 వేల పింఛన్‌ వచ్చేది. ఇందుకోసం బీజేపీ ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. యోగి జీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నందున నేను ఈ పథకాలను చేయగలుగుతున్నాను. నేను ఢిల్లీ నుండి పంపేందుకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవు. ఆ పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

గత ఐదేళ్లలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ అనేక కొత్త రోడ్లను నిర్మించిందని, రోడ్ల విస్తరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. కరెంటు లేకపోవడంతో బల్లియా ప్రజలు పడుతున్న బాధ నాకు అర్థమైంది. యూపీలో 5 దశల పోలింగ్‌ జరిగిందని ప్రధాని చెప్పారు. పశ్చిమం నుండి తూర్పు వరకు, యూపీ ప్రజలు.. కుటుంబ పాలనను తిరస్కరించారు. యూపీ వాహనం ఇకపై కుల వీధుల్లో ఇరుక్కోబోదని యూపీ ప్రజలు చెప్పారు.


Read Also…. AP Assembly: మార్చి 7 తేదీ నుంచి ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభం.. టీడీపీ హాజరయ్యేనా?