‘ఎడమ కుడి’ అయితే పొరబాటు లేదోయ్..

అనుకోకుండా చిన్న దెబ్బతగిలిందని డాక్టర్ల దగ్గరకు వెళ్లిన ఓ వ్యక్తి..తన శరీరంలోని అవయవాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నట్టు తెలిసి నిర్ఘాంతపోయాడు ! పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి గ్రామానికి చెందిన కనకయ్య ఏనిమిదేళ్ల క్రితం అనుకోని ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు కనకయ్యకు వైద్యం చేశారు. దాంతోపాటుగా మరికొన్ని టెస్టులు కూడా చేశారు. అయితే, ఆ టెస్టుల రిపోర్ట్‌లు పరిశీలించిన అక్కడి డాక్టర్లకు ముందుగా ఏమీ అర్థం కాలేదు. దీంతో […]

'ఎడమ కుడి' అయితే పొరబాటు లేదోయ్..
Follow us

|

Updated on: Dec 12, 2019 | 4:12 PM

అనుకోకుండా చిన్న దెబ్బతగిలిందని డాక్టర్ల దగ్గరకు వెళ్లిన ఓ వ్యక్తి..తన శరీరంలోని అవయవాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నట్టు తెలిసి నిర్ఘాంతపోయాడు ! పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి గ్రామానికి చెందిన కనకయ్య ఏనిమిదేళ్ల క్రితం అనుకోని ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు కనకయ్యకు వైద్యం చేశారు. దాంతోపాటుగా మరికొన్ని టెస్టులు కూడా చేశారు. అయితే, ఆ టెస్టుల రిపోర్ట్‌లు పరిశీలించిన అక్కడి డాక్టర్లకు ముందుగా ఏమీ అర్థం కాలేదు. దీంతో మరోమారు టెస్టులు చేశారు. అయినా అవే.. సేమ్‌ రిజల్ట్స్‌ రావడంతో వారంతా ఖంగుతిన్నారు. మామూలుగా అందరిలో ఎడమవైపు ఉండాల్సిన గుండె కనకయ్యకు కుడివైపు ఉండటం గమనించి డాక్టర్లు విస్తు పోయారు. చాలా కొద్దిమందిలో మాత్రమే ఇటువంటి లక్షణాలు ఉంటాయని, అయినప్పటికీ వారు అందరిలాగే దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవిస్తుంటారని వైద్య నిపుణులు చెప్పారు. ప్రస్తుతం కనకయ్య వయసు 65 ఏళ్లు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. తనకు గుండె కుడివైపు ఉందన్న విషయం 2011 జులైలో తెలిసింది. అప్పటి నుండి కూడా తాను అంతే ఆరోగ్యంతో ఉన్నాడని, ఎటువంటి అనారోగ్యం, అస్వస్థత లేదని చెబుతున్నారు కనకయ్య కుటుంబీకులు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న కనకయ్య అందిరిలాగే తానూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. దాంతో పాటుగా తనకున్న గొర్రెలను అందరితోపాటుగానే మేతకు తీసుకువెళ్తానని చెప్పాడు. కానీ, అందరూ తన పరిస్థితి గుర్తు చేసినప్పుడు మాత్రం కాస్తా అయోమయానికి లోనవుతానని, అంతేగానీ,తనకు ఎటువంటి ఇబ్బంది లేదని ఎంతో గుండెనిబ్బరంతో చెప్పాడు కనకయ్య. కాగా, ఇటీవలే మెదక్‌ జిల్లా తూప్రాన్‌లోనూ ఓ చిన్నారి కుడివైపు గుండెకలిగి జన్మించిన విషయం తెలిసిందే.

Latest Articles
అభిమానితో అనుచిత ప్రవర్తన.. ధనుష్ పై నెటిజన్స్‌ సీరియస్.!
అభిమానితో అనుచిత ప్రవర్తన.. ధనుష్ పై నెటిజన్స్‌ సీరియస్.!
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.