అమీన్‌పూర్ తీవ్ర విషాదం.. మేకపిల్లను కాపాడేందుకు ప్రయత్నించి ప్రాణాలను కోల్పోయిన యువకుడు

చెరువులో పడ్డ మేక పిల్లను బయటకు తీసేందుకు యత్నించి యువకుడు ఈతరాక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

అమీన్‌పూర్ తీవ్ర విషాదం.. మేకపిల్లను కాపాడేందుకు ప్రయత్నించి ప్రాణాలను కోల్పోయిన యువకుడు
Family-Death

Updated on: Jan 26, 2021 | 12:55 PM

Young Man died:  నీట మునుగుతున్న మూగ జీవాన్ని కాపాడేందుకు ప్రయత్నించి ఓ యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగర శివారులో చోటుచేసుకుంది. చెరువులో పడ్డ మేక పిల్లను బయటకు తీసేందుకు యత్నించి యువకుడు ఈతరాక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అమీన్‌పూర్‌ టైలర్స్‌ కాలనీకి చెందిన షేక్‌ అసద్‌(18) ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడి కుటుంబం పెంచుకుంటున్న మేక పిల్లకు జబ్బు చేసింది. మేకపిల్ల ఆనారోగ్యానికి గురికావడంతో.. అతని సోదరుడు అలీబాబాతో కలిసి కిష్టారెడ్డిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యం చేయించుకుని తిరిగి వస్తుండగా మేకపిల్లను కుక్కలు వెంబడించాయి.

అయితే, మేక ప్రాణాలతో పరుగులు తీస్తూ అదే గ్రామంలోని పోసముంద్ర చెరువులోకి వెళ్లింది. రక్షించేందుకు అసద్‌ చెరువులోకి దిగాడు. లోతుగా ఉండటంతో అసద్.. ఈతరాక మునిగిపోయాడు. సోదరుడు కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కాగా, 20 రోజుల కిందటే జరిగిన రోడ్డు ప్రమాదంలో అసద్ మృతిచెందారు. ఇప్పుడు కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబానికి తీవ్ర గర్భశోకాన్ని మిగిల్చింది.

Read Also…  తెలంగాణలో కొత్తగా 189 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ.. ఇవాళ మరో ఇద్దరు మృతి..

Loading...
Unable to load recommendations.
Follow Us