ఏపీ న్యూస్ : వార్డు వాలంటీర్‌‌కి కత్తిపోట్లు..అసలేం జరిగింది..?

|

Dec 04, 2019 | 6:45 PM

వార్డు, గ్రామ వాలంటీర్లకు ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. గ్రామ స్వరాజ్యం కోసం సీఎం జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ టీమ్స్ రాష్ట్రవ్యాప్తంగా యాక్లీవ్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే విశాఖలో ఓ వార్డు వాలంటీర్‌పై వ్యక్తి దాడి చేయడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. తన ఇంటికి వచ్చి వివరాలు తీసుకోలేదన్న కోపంతో అతడు రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…విశాఖలోని మధురవాడ కె-1 కాలనీలో వార్డు వాలంటీర్‌గా లాల్ బహుదూరాయ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇటీవల […]

ఏపీ న్యూస్ : వార్డు వాలంటీర్‌‌కి కత్తిపోట్లు..అసలేం జరిగింది..?
Follow us on

వార్డు, గ్రామ వాలంటీర్లకు ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. గ్రామ స్వరాజ్యం కోసం సీఎం జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ టీమ్స్ రాష్ట్రవ్యాప్తంగా యాక్లీవ్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే విశాఖలో ఓ వార్డు వాలంటీర్‌పై వ్యక్తి దాడి చేయడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. తన ఇంటికి వచ్చి వివరాలు తీసుకోలేదన్న కోపంతో అతడు రెచ్చిపోయినట్టు తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…విశాఖలోని మధురవాడ కె-1 కాలనీలో వార్డు వాలంటీర్‌గా లాల్ బహుదూరాయ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం వైట్ కార్డును పలు రకాలుగా డివైడ్ చేేస్తోన్న విషయం తెలిసిందే. దీని కోసం ప్రభుత్వం.. గ్రామ, వార్డు వాలంటీర్ల నుంచి డేటాను సేకరించింది. నవంబర్ 20 వ తేదీ నుంచి 30 వరకు ఈ సర్వే జరిగింది.

అయితే ఈ సర్వే చేసేటప్పుడు వాలంటీర్ తన దగ్గర నుంచి డేటా తీసుకోలేదన్న నెపంతో , వార్డులోని ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. రెండుసార్లు కడుపులో పొడవడటంతో అతను అక్కడికక్కడే కూలిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు వెంటనే అతడిని కేజీహెచ్‌కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.