కత్తితో గొంతు కోసుకుని యువకుడి ఆత్మహత్యయత్నం

|

Jun 30, 2020 | 6:44 PM

వరంగల్ లో ఓ యువకుడు నడిరోడ్డుపై కత్తితో గొంతు కోసుకున్నాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. రోడ్డుపై తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కత్తితో గొంతు కోసుకుని యువకుడి ఆత్మహత్యయత్నం
Follow us on

వరంగల్ లో ఓ యువకుడు నడిరోడ్డుపై కత్తితో గొంతు కోసుకున్నాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. రోడ్డుపై తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ అదాలత్ జంక్షన్ వద్ద మాసం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నానికి పాల్పడ్డాడు. అయితే, నా చావుకు ప్రముఖ రాజకీయ నాయకుడే కారణమంటూ లేఖ రాసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు స్థానికులు తెలిపారు. ఆ యుకుడిని నెక్కొండ మండలానికి చెందిన మాసం వెంకటేశ్వర్లుగా స్థానికులు గుర్తించారు. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఏంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ వైద్యులు తెలిపారు.