హీరోయిన్ అమలాపాల్‌పై కేసు చెల్లదు.. కేరళ పోలీస్

| Edited By: Pardhasaradhi Peri

Aug 28, 2019 | 4:54 PM

తప్పుడు చిరునామాతో తో ఓ లగ్జరీ కారు కొనుగోలు చేసిందనే ఆరోపణలతో నమోదైన కేసులో నటి అమలాపాల్‌కు కేరళలో ఊరట లభించినట్టు తెలుస్తోంది. అమలాపాల్ స్వస్థలం కేరళ. అయితే అమె పుదుచ్చేరీలో నివసిస్తున్నట్టుగా తప్పుడు ధృవపత్రాలు సమర్పించి ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఈ వివాదంలో ఆమెపై సెక్షన్ 430 – 468 – 471 సెక్షన్ల కింద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ నేపథ్యంలో అమల అరెస్టు తప్పదనే వార్తలు […]

హీరోయిన్ అమలాపాల్‌పై కేసు చెల్లదు.. కేరళ పోలీస్
Follow us on

తప్పుడు చిరునామాతో తో ఓ లగ్జరీ కారు కొనుగోలు చేసిందనే ఆరోపణలతో నమోదైన కేసులో నటి అమలాపాల్‌కు కేరళలో ఊరట లభించినట్టు తెలుస్తోంది. అమలాపాల్ స్వస్థలం కేరళ. అయితే అమె పుదుచ్చేరీలో నివసిస్తున్నట్టుగా తప్పుడు ధృవపత్రాలు సమర్పించి ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఈ వివాదంలో ఆమెపై సెక్షన్ 430 – 468 – 471 సెక్షన్ల కింద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ నేపథ్యంలో అమల అరెస్టు తప్పదనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. మరోవైపు పుదుచ్చేరి మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్‌కు రూ. 20 లక్షలు ఎగ్గొట్టి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిందని .. ఆమెపై చర్యలు తీసుకోవాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ కూడా అప్పట్లో ఆదేశించారు. అయితే ఘటన జరిగింది పుదుచ్చేరిలో.. కేసు రిజిస్టర్ అయ్యింది మాత్రం కేరళలో, ఈ ఘటన అక్కడ జరిగింది గనుక కేరళకు పోలీసులకు ఏమీ సంబంధం లేదన్నట్టు తెలుస్తోంది.