ఏనుగుల మరణమ‌ృదంగం..! వెలుగులోకి మరో దారుణం

|

Jul 03, 2020 | 7:45 PM

మొన్న కేరళలో ఓ ఏనుగుకి పైనాపిల్‌లో బాంబ్ పెట్టిన ఘటనలో ఆ ఏనుగు దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరో వైపు ఏపీలో, మధ్యప్రదేశ్‌లో రెండు చోట్ల ఆవులకు పేలుడు పదార్థాలు తినిపించటంతో అవి తీవ్రంగా గాయపడిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా,..

ఏనుగుల మరణమ‌ృదంగం..! వెలుగులోకి మరో దారుణం
Follow us on

దేశంలో ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారి ప్రజల్ని వణికిస్తోంది. మరోవైపు కొందరు మనుషులు రాక్షసుల్లా మారుతున్నారు. ఇటీవల వరుసగా మూగజీవాలపై జరిగిన దారుణాలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. మొన్న కేరళలో ఓ ఏనుగుకి పైనాపిల్‌లో బాంబ్ పెట్టిన ఘటనలో ఆ ఏనుగు దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరో వైపు ఏపీలో, మధ్యప్రదేశ్‌లో రెండు చోట్ల ఆవులకు పేలుడు పదార్థాలు తినిపించటంతో అవి తీవ్రంగా గాయపడిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా, తమిళనాడులోని కోయంబత్తూరులో మరో సంఘటన చోటు చేసుకుంది.

తమిళనాడులోని కోయంబత్తూరులో విషాద సంఘటన చోటు చేసుకుంది. బుల్లెట్ గాయంతో మరణించిన ఓ ఆడ ఏనుగును స్థానికులు ఉదయం గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఏనుగు చెవి వెనుగ భాగంలో బులెట్ గాయమైనట్లు గుర్తించారు. మృతదేహాన్ని తీసుకెళ్లి పోస్ట్ మార్టం నిర్వహించారు. బులెట్ గాయం కారణంగానే ఏనుగు మరణించినట్లు పశువైద్యులు నిర్ధారించారు. దీంతో ఏనుగు మృతదేహం లభించిన ఫార్మ్ యాజమానులు ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దేశంలో వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలపై జంతుప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్మర్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.