కట్నం వేధింపుల కేసులో.. టీవీ నటుడు మధుప్రకాష్ అరెస్ట్

సీరియల్ నటుడు మధుప్రకాష్ అరెస్టయ్యాడు. అదనపు కట్నం కోసం వేధింపుల కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కాగా నిన్న రాత్రి మధుప్రకాష్ భార్య భారతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మణికొండ పంచవటి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధుప్రకాష్ వేధింపులే భారతి ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. భార్యభర్తల మధ్య గొడవలే భారతి మృతికి కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. గుంటూరుకి చెందిన భారతికి.. మధుప్రకాష్‌తో 2015లో వివాహం జరిగింది. ఓ ప్రైవేటు […]

కట్నం వేధింపుల కేసులో.. టీవీ నటుడు మధుప్రకాష్ అరెస్ట్

Updated on: Aug 07, 2019 | 4:38 PM

సీరియల్ నటుడు మధుప్రకాష్ అరెస్టయ్యాడు. అదనపు కట్నం కోసం వేధింపుల కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కాగా నిన్న రాత్రి మధుప్రకాష్ భార్య భారతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మణికొండ పంచవటి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధుప్రకాష్ వేధింపులే భారతి ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. భార్యభర్తల మధ్య గొడవలే భారతి మృతికి కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. గుంటూరుకి చెందిన భారతికి.. మధుప్రకాష్‌తో 2015లో వివాహం జరిగింది. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమె.. అత్తమామలతో కలిసి మణికొండలోని పంచవటి కాలనీలో ఫ్లాట్‌లో ఉంటున్నారు. భర్త మధుప్రకాష్‌.. సీరియల్‌లో నటిస్తుండం కారణంగా ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు.. ఇది నచ్చని భారతి.. సీరియల్స్‌ మానేయమని.. చెబుతూవుండేది. అలాగే.. కొంతకాలంగా.. మరో సీరియల్ నటితో మధుప్రకాష్ చనువుగా ఉండటంతో కుటుంబకలహాలు మరింత ఎక్కువయ్యాయని కుటుంబసభ్యులు చెప్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us