రోహిత అదృశ్యం.. ఒక్క క్లూ కూడా దొరకలేదా..!

| Edited By: Pardhasaradhi Peri

Jan 13, 2020 | 1:44 PM

మహిళా సాఫ్ట్‌వేర్ రోహిత మిస్సింగ్ సస్పెన్స్ కొనసాగుతోంది. ఆమె కనిపించకుండా పోయి 18 రోజులు గడిచినప్పటికీ.. ఆమె జాడకు సంబంధించిన ఒక్క క్లూ కూడా ఇంతవరకు పోలీసులకు చిక్కలేదు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన అంతకంతకూ పెరిగిపోతోంది. రోహిత కోసం హైదరాబాద్‌ అంతా మూడు కమిషనరేట్ల పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇదిలా ఉంటే రోహిత మిస్సింగ్‌పై ఆపిల్‌ ఇండియా స్పందించింది. రోహితా తిరిగిరావాలని కోరుకుంటున్నానని ఆపిల్ ఇండియా కంపెనీ తెలిపింది. కాగా 34ఏళ్ల వయసున్న రోహిత డిసెంబర్ […]

రోహిత అదృశ్యం.. ఒక్క క్లూ కూడా దొరకలేదా..!
Follow us on

మహిళా సాఫ్ట్‌వేర్ రోహిత మిస్సింగ్ సస్పెన్స్ కొనసాగుతోంది. ఆమె కనిపించకుండా పోయి 18 రోజులు గడిచినప్పటికీ.. ఆమె జాడకు సంబంధించిన ఒక్క క్లూ కూడా ఇంతవరకు పోలీసులకు చిక్కలేదు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన అంతకంతకూ పెరిగిపోతోంది. రోహిత కోసం హైదరాబాద్‌ అంతా మూడు కమిషనరేట్ల పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇదిలా ఉంటే రోహిత మిస్సింగ్‌పై ఆపిల్‌ ఇండియా స్పందించింది. రోహితా తిరిగిరావాలని కోరుకుంటున్నానని ఆపిల్ ఇండియా కంపెనీ తెలిపింది.

కాగా 34ఏళ్ల వయసున్న రోహిత డిసెంబర్ 26న అదృశ్యమైంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో.. విప్రో సర్కిల్ దగ్గర ఆటో ఎక్కిన రోహిత.. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఫోన్ కూడా రూమ్‌లోనే వదిలి వెళ్లడంతో చివరగా రోహిత ఎక్కడికి వెళ్లింది అనే విషయాన్ని కూడా పోలీసులు తెలుసుకోలేకపోతున్నారు. వీటికి తోడు డిసెంబర్ 23న తన అకౌంట్ నుంచి రూ.80వేలు డ్రా చేసింది రోహిత. ఈ నేపథ్యంలో ఆ డబ్బు ఏమైంది..? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.