పార్వతీపురంలో పోలీసుల కార్డన్ సర్చ్.. భారీగా సారా స్వాధీనం..

| Edited By:

Jun 14, 2020 | 9:45 PM

విజయనగరం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున పార్వతీపురం పట్టణంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. పట్టణంలోని వీధుల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు, పోలీసుల ఆకస్మిక దాడులు నిర్వహించారు.

పార్వతీపురంలో పోలీసుల కార్డన్ సర్చ్.. భారీగా సారా స్వాధీనం..
Follow us on

విజయనగరం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున పార్వతీపురం పట్టణంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. పట్టణంలోని వీధుల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు, పోలీసుల ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున సారా తయారీ చేస్తున్న ముఠాను గుర్తించారు. దాదాపు 100 మంది పోలీస్ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. 415 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామని.. 13 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. మరో 21 టూవీలర్స్‌ను స్వాధీనం చేసుకున్నామని.. వీటికి సరైన పేపర్లు లేని కారణంగా సీజ్ చేశామని.. తెలిపారు. సారా స్వాధీనానికి సంబంధించి ఆరు కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈ కార్డన్‌ సెర్చ్‌లో పార్వతీపురం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ, ఏసీపీ కూడా పాల్గొన్నారు.