
తెలంగాణ రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొని తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ డిపోకు చెందిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో చేచడి పర్వతల్ (9) అనే బాలుడు తన ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా బస్సు ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిపై చంద్రగిరి మండలం పనబాకం సింగిల్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న టిప్పర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన సుమో వాహనం బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సుమోలో ప్రయాణిస్తున్న ఓ మహిళతో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.