కేరళ ఏనుగు ఉదంతం మరువక ముందే మరో ఘోరం..ఇక్కడ గర్భిణీ ఆవు

|

Jun 06, 2020 | 3:28 PM

కేరళలోపైనాపిల్ ఎరతో పేలుడు పదార్థాన్ని తిన్న ఏనుగు మరణం దేశమంతా వైరల్ అయ్యింది. ప్రజలలో సానుభూతి, ఆగ్రహాలకు గురిచేసింది. ఆ ఏనుగును చంపిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కేంద్ర మంత్రుల నుంచి సినీ ప్రముఖుుల, సాధారణ ప్రజల వరకు అందరూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. అదే తీరులో ఓ ఆవుపై పైశాచికం ప్రదర్శించారు.

కేరళ ఏనుగు ఉదంతం మరువక ముందే మరో ఘోరం..ఇక్కడ గర్భిణీ ఆవు
Follow us on

కేరళలోపైనాపిల్ ఎరతో పేలుడు పదార్థాన్ని తిన్న గర్భిణీ ఏనుగు మరణం దేశమంతా వైరల్ అయ్యింది. ప్రజలలో సానుభూతి, ఆగ్రహాలకు గురిచేసింది. ఆ ఏనుగును చంపిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కేంద్ర మంత్రుల నుంచి సినీ ప్రముఖులు, సాధారణ ప్రజల వరకు అందరూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఆ ఘటన మరువక ముందే అదే తీరులో ఓ ఆవుపై పైశాచికం ప్రదర్శించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లా జాందుత్తలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.

పొలలంలోని గడ్డిలో దాచిన పేలుడు పదార్థాన్ని తిన్న ఆవు దవడ పేలిపోయి రక్తసిక్తమైంది. ఈ వీడియోను యజమాని గురుదయాళ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన పొరుగింట్లో ఉంటున్న నందలాల్ అనే వ్యక్తే ఈ దురాగతానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని రైతు డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత నందలాల్ కనిపించటం లేదు. ఇల్లు వదిలి పారిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో అతడే ఈ దారుణానికి పాల్పడి ఉంటడాని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గాయం కారణంగా ఆవు ఆహారం తినలేక ఇబ్బందిపడుతోంది. పది రోజల కిందట జరిగిన ఈ ఘోరంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.