సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కేసులో కొత్త ట్విస్ట్.. ఆమెతో వివాహేతర సంబంధం..!

| Edited By:

Aug 31, 2019 | 10:54 AM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రకారమే సతీష్‌ను తన ఇంటికి పిలిపించి హేమంత్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్య సమయంలో హేమంత్‌తో పాటు మరో మహిళ కూడా ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో నిందితుడు హేమంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే హేమంత్ […]

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కేసులో కొత్త ట్విస్ట్.. ఆమెతో వివాహేతర సంబంధం..!
Follow us on

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రకారమే సతీష్‌ను తన ఇంటికి పిలిపించి హేమంత్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్య సమయంలో హేమంత్‌తో పాటు మరో మహిళ కూడా ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో నిందితుడు హేమంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదిలా ఉంటే హేమంత్ స్నేహితురాలు ప్రియాంకతో సతీష్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంకను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హేమంత్, సతీష్ మధ్య ఆర్థికపరమైన గొడవలున్నట్లు ప్రియాంక తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సతీష్.. గత మూడు క్రితం అదృశ్యమవ్వగా.. శుక్రవారం హేమంత్ ఇంట్లో దారుణ హత్యకు గురయ్యాడు.