మేనేజర్‌ను కసితీరా పొడిచి పొడిచి చంపిన మహిళా ఉద్యోగి! కారణం తెలిస్తే..

ఓ మహిళా ఉద్యోగి తన మేనేజర్ ను 15 సార్లు కత్తితో పొడిచి హత్య చేసింది. పనిలోని వేధింపులు, పేలవమైన పనితీరు గురించి నిరంతర కేకలు వేయడం వలన ఈ హింసాత్మక చర్యకు దారితీసింది. ఈ సంఘటనకు ముందు అఫెని సోషల్ మీడియాలో తన మేనేజర్‌పై తన ఆవేదనను వ్యక్తం చేసింది.

మేనేజర్‌ను కసితీరా పొడిచి పొడిచి చంపిన మహిళా ఉద్యోగి! కారణం తెలిస్తే..
Representative Image

Updated on: Jul 15, 2025 | 4:33 PM

పనిలో ఒత్తిడి ఉండటం సహజం, కొన్నిసార్లు అది చికాకు కలిగిస్తుంది. అప్పుడు సహజంగానే కోపం వస్తుంది. కొంతమంది సీనియర్ ఉద్యోగులు ఆఫీస్‌లో తమకంటే చిన్నస్థాయి ఉద్యోగులను బెదిరించే సంస్కృతి గతం నుండి ఉంది. ఇలాంటి పరిస్థితులు కొంతమంది ఉద్యోగాలు మానేయడానికి, మరికొందరు ఆత్మహత్య వంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అయ్యాయి. కానీ ఈ మహిళా ఉద్యోగి మాత్రం.. ఆ రెండు మార్గాలు కాకుండా.. మూడో మార్గంగా ఏకంగా మేనేజర్‌నే హత్య చేసింది. కూడా కసితీరా అతన్ని 15 సార్లు కత్తితో పొడిచి చంపేసింది. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. మిచిగాన్‌లోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో అఫెని ముహమ్మద్ అనే 26 ఏళ్ల మహిళ మేనేజర్ జెన్నిఫర్ హారిస్ (39 సంవత్సరాలు) పై 15 సార్లు కత్తితో దాడి చేసింది హత్య చేసింది.

అఫెని ముహమ్మద్ అనే మహిళా ఉద్యోగి తన మేనేజర్ జెన్నిఫర్ హారిస్ పై కోపంతో కత్తితో దాడి చేసింది. ఈ సంఘటన జూలై 12న జరిగింది. సరిగ్గా పని చేయనందుకు, పేలవమైన పనితీరు కారణంగా ఆ మేనేజర్‌ మహిళా ఉద్యోగిపై పదే పదే కేకలు వేసేవాడని తెలుస్తోంది. దీంతో అఫెని అతనిపై కోపం పెంచుకుంది. అఫెని ముహమ్మద్ తన మేనేజర్‌ను హత్య చేయడానికి ఒక రోజు ముందు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలలో తన మేనేజర్ గురించి కొన్ని కోపంగా ఉన్న కథనాలను పోస్ట్ చేసింది. మేనేజర్ తనను చిన్నచూపు చూస్తున్నాడని ఆమె పేర్కొంది. నేను దీన్ని ఇక భరించలేను అని రాసుకొచ్చింది.

మరుసటి రోజు ఈ విషయంపై ఇద్దరి మధ్య మరోసారి వాదన జరిగింది. దీంతో మేనేజర్ ఆమెను ఇంటికి వెళ్లిపోవాలని కోరాడు. ఆమె కోపంగా తన కారు వద్దకు వెళ్లి, కారు నుండి కత్తిని తీసుకొచ్చి మేనేజర్‌ను 15 సార్లు పొడిచి చంపింది. కంపెనీలో ఒక వ్యక్తి దీనిని చూసి ఆమెను ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే మేనేజర్ చనిపోయాడు. ఆ మహిళ వెంటనే అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించింది, కానీ అక్కడి సిబ్బంది వెంటనే ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి