హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం

| Edited By: Ram Naramaneni

Jul 04, 2019 | 6:02 PM

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ వద్ద తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. టీఎస్09యుబి6040 బెంజ్‌కారులో వచ్చిన యూఎస్‌ కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఫైజల్‌ అహ్మద్‌ రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని స్థానికులు రాయదుర్గంలోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీసీపీ వెంకటేశ్వరరావు పరిశీలించారు. మృతుడు మాసాబ్‌ట్యాంక్‌లో నివాసం ఉంటున్న సల్మాన్‌ అహ్మద్‌ అనే వ్యక్తి […]

హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం
Follow us on

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ వద్ద తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. టీఎస్09యుబి6040 బెంజ్‌కారులో వచ్చిన యూఎస్‌ కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఫైజల్‌ అహ్మద్‌ రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని స్థానికులు రాయదుర్గంలోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనా స్థలాన్ని డీసీపీ వెంకటేశ్వరరావు పరిశీలించారు. మృతుడు మాసాబ్‌ట్యాంక్‌లో నివాసం ఉంటున్న సల్మాన్‌ అహ్మద్‌ అనే వ్యక్తి కుమారుడిగా గుర్తించామని డీసీపీ వివరించారు. యూఎస్‌ కన్సెల్టెన్నీ నిర్వహిస్తున్నాడనీ.. వ్యాపారంలో అప్పులు ఉండటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు భావిస్తున్నామని చెప్పారు. తలపై కాల్చుకోవడంతో ప్రస్తుతం అతడి ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు చెప్పారు. పూర్తి సమాచారం సేకరిస్తున్నామని.. తుపాకీ అతనిదేనా? ఇంకెవరిదైనా అనే కోణంలో విచారిస్తున్నట్టు చెప్పారు.